అర్జున్ రెడ్డి తమిళ రీమేక్.. ఛాన్స్ కొట్టేసిన క్యూట్ హీరోయిన్!
గత ఏడాది విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్, కోలివుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అర్జున్ రెడ్డి చిత్రాన్ని దర్శకుడు సందీప్ వంగ బోల్డ్ లవ్ స్టోరీగా ప్రజెంట్ చేసారు.
విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంట యువతని ఆకట్టుకుంది. ఈ చిత్రం సంచలన విజయం సాధించిన తరువాత రీమేక్ హక్కుల కోసం అన్ని చిత్ర పరిశ్రమల నుంచి నిర్మాతలు పోటీ పడ్డారు. అర్జున్ రెడ్డి చిత్రం హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అవుతోంది. తమిళంలో విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు బాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. మొదట తెలుగులో నటించిన షాలిని పాండేనే నటిస్తుందని భావించారు. తాజాగా క్యూట్ హీరోయిన్ శ్రియా శర్మ పేరు వినిపిస్తోంది. వర్మ చిత్రంలో శ్రియా శర్మ అవకాశం దక్కించుకుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. శ్రియా శర్మ జైచిరంజీవి వంటి చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. నిర్మల కాన్వెంట్ చిత్రంతో హీరోయిన్ గా మారింది.


Click it and Unblock the Notifications











