త్రాగి చిందులేస్తూ ప్రాణాయామం పటిస్తున్న శ్రియ!
సినిమా తారలు ఏం చేసినా వింతగానూ, విశేషంగానూ, ఇంకా చెప్పాలంటే హాట్ గానూ ఉంటుంది. ఆ మధ్య హీరోయిన్ త్రిష, మందుకొట్టి రోడ్ల పై అల్లర్లు చేసిన విషయం తెలిసిందే..తాజాగా అదే దారిలో నడుస్తుంది. శ్రియ. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరైన శ్రియ, ఫుల్ గా త్రాగి, అక్కడ గందరగోళాన్ని సృష్టించినదట త్రిష, రోడ్ల పై అల్లర్లు చేస్తే శ్రియ కాస్తంత బెటర్ గా నాలుగు గోడల మధ్య వేషాలు వేసింది. కాని ఏంలాభం..ఆమె త్రాగి చిందులేసి, చేసిన అల్లరి మొత్తం వీడియోతో సహా ఇంటర్నెట్ లో దర్శనం ఇవ్వడంతో తెరుకున్న శ్రియ అరే! అలా చేయకుండా ఉండాల్సింది అంటూ ముఖం చాటేస్తుంది.
శ్రియకి కాస్తంత కంగారెక్కువంట. ఆకంగారులో తప్పులు చేస్తుంటానని శ్రియ చేసిన తప్పులు ఒప్పుకోవడమే కాదు, దానికి మంచి మందు కూడా నా దగ్గర వుంది అంటోంది. కంగారెక్కువైనప్పుడల్లా శ్రియ యోగాలోని ఒక ఆసనమైన ప్రాణాయామం చేసేస్తోందట. అది చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా మారిపోతానని శ్రియ అంటోంది.
అయితే ముందు ఉషారుగా త్రాగడం తర్వాత ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా భావించడం ఎందుకు అంటూ విమర్శకులు అనుకుంటున్నారు. అసలే సినిమాలు లేక తల్లిడిల్లిపోతున్న నీకు ఇటువంటి వేషాలు అవసరమా! చెప్పు ఇకనైనా కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే నీ చాప్టర్ కూడా క్లోజ్ అంటూ శ్రియను హెచ్చరిస్తున్నారు. విమర్శకులు.


Click it and Unblock the Notifications











