పడుకునే ముందు.. అది తప్పనిసరి, లేకపోతే నిద్రపట్టదు: శ్రుతి హాసన్

Recommended Video

Shruti Haasan: పడుకునే ముందు.. అది తప్పనిసరి, లేకపోతే నిద్రపట్టదు

ప్రతీ మనిషికి 'సెల్ఫ్ చెక్' అనేది అవసరం. విలువలు అన్న మాటకు అర్థమే లేని సమాజంలో ఇదో 'రియాలిటీ చెక్'. జీవితపు ప్రవాహంలో.. ఏదో అలా పడి కొట్టుకుపోవడం కాకుండా.. కాస్త ఆత్మపరిశీలన చేసుకోవడం ఆత్మ సంతృప్తినిస్తుంది. అన్నింటికి మించి జీవితానికో అర్థమిస్తుంది. అందుకే హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా ఈ సూత్రాన్ని తప్పక ఫాలో అవుతాను అంటున్నారు.

శ్రుతి 'ఫార్మూలా' ఇదీ..:

శ్రుతి 'ఫార్మూలా' ఇదీ..:

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అంతా ఉరుకుల పరుగుల జీవితం. బిజీ షెడ్యూల్. రాత్రయ్యేసరికి రోజంతా ఏం చేశామన్నది గుర్తుచేసుకునే టైమ్ కూడా ఉండదు. కానీ నేనలా కాదు. ప్రతీరోజు నిద్రకు ఉపక్రమించే ముందు అన్నీ గుర్తుచేసుకుంటా.

ఆ రెండు..:

ఆ రెండు..:

అలా గుర్తుచేసుకునే క్రమంలో.. ప్రధానంగా రెండు విషయాలు బాగా గుర్తుంచుకుంటా. ఒకటి.. ఆరోజు అయిష్టంగా ఏదైనా పని చేసి ఉంటే.. ఇక జీవితంలో దాని జోలికి వెళ్లను. రెండు.. అకారణంగా ఎవరినైనా బాధపెట్టి ఉంటే.. మళ్లీ తప్పు రిపీట్ చేయకూడదని బలంగా నిశ్చయించుకుంటాను. ప్రతీరోజూ ఇలా సెల్ఫ్ చెక్ చేసుకోకపోతే నాకు నిద్రపట్టదు.

నాన్న నేర్పిన అలవాటే..:

నాన్న నేర్పిన అలవాటే..:

ఇంత మంచి అలవాట్లు అలవడానికి తన నాన్నే కారణమంటున్నారు శ్రుతీహాసన్. 'ఇదంతా నాన్న వల్లే. ఎప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోలేదంటే.. ఆరోజు నువ్వేదో చేయకూడదని పని చేసి ఉంటావ్.. జీవితంలో ఇక మళ్లీ పని చేయవద్దు' అన్న సూత్రాన్ని పదేపదే చెప్పేవారట.

ఇప్పటికీ ఇదే నా మంత్ర..:

ఇప్పటికీ ఇదే నా మంత్ర..:

'నాన్న చెప్పిన ఈ సూత్రాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు. అందుకే ప్రతీరోజు నిద్రపోయే ముందు కచ్చితంగా సెల్ఫ్ చెక్ చేసుకుంటా. వ్యక్తిగతంగా మన తప్పొప్పుల్ని ఆత్మపరిశీలన చేసుకోవడం అత్యవసరం. మన వ్యక్తిత్వాన్ని మరింత ఇనుమడింపజేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది' అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X