Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోయాడా.. మళ్లీ హీరోయిన్‌కు అవకాశం
సూపర్ స్టార్ మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన మహర్షి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీకెండ్ ఫార్మింగ్ అంటూ కొత్త కాన్సెప్ట్‌ను మహేష్ లాంటి హీరో చేత చెప్పించి.. అందరికీ చేరువయ్యేలా చేశాడు. ఆ మూవీ తరువాత సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణలో మహేష్ బిజీగా ఉండగా.. వంశీ మాత్రం మరే ప్రాజెక్ట్‌కు కమిట్ కాకుండా మహేష్ కోసం ఎదురుచూస్తున్నట్టు టాక్.
మరోసారి వంశీతో..
మహేష్ కెరీర్లో నిలిచిపోయేలా 25వ చిత్రాన్ని అందించాడు వంశీ. అందుకే మరోసారి వంశీకి అవకాశమిచ్చేందుకు రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. మహేష్ 27వ చిత్రంగా వంశీ డైరెక్షన్లో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఆసక్తికరంగా మారాయి.
గ్యాంగ్ స్టర్ కథతో.
మహర్షి కంటే భిన్నంగా అంతకంటే పెద్ద విజయం సాధించాలనే దిశగా.. ఈసారి సూపర్ స్టార్‌ను కొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడట. మహేష్‌ను ఓ గ్యాంగ్ స్టార్‌గా చూపించనున్నాడన్న ప్రచారం సాగుతోంది. సూపర్ స్టార్ ఇంతకుముందెన్నడూ చేయని విధంగా ఉండేలా క్యారెక్టర్‌ను రెడీ చేశాడని ఇటీవల గుసగుసలు వినిపిస్తున్నాయి.
హీరోయిన్గా ఆమె..
అలాగే తాజా సమాచారం ప్రకారం... ఈ చిత్రంలో అందాల తార శ్రుతీ హాసన్ కథానాయికగా నటించనుందని టాక్ వినిపిస్తోంది. శ్రుతి ఇంతకుముందు శ్రీమంతుడు చిత్రంలో మహేష్ సరసన నటించింది. ఇప్పుడు రెండోసారి మహేష్ సరసన నటింపజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయట.
అప్పటి విషయం..
అయితే శ్రుతి హాసన్ వల్ల వంశీ పైడిపల్లికి గతంలో ఓ చేదు అనుభవం జరిగిన సంగతి తెలిసిందే. నాగార్జున- కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి చిత్రానికి సంతకం చేసి.. సరిగ్గా లాంచింగ్‌కి రెండ్రోజుల ముందు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. మరి ఇలా హ్యాండిచ్చిన శ్రుతీని మరోసారి తీసుకుంటాడా? అన్నది డౌటే. మహేష్‌కు ఓకే అయితే అంతా సెట్ అయిపోద్దనుకోండి.