రామ్ చరణ్ సరసన శృతి హాసన్ ని ఫైనలైజ్ చేసారు
రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఆరెంజ్' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. దాదాపు పదిహేను నిముషాల పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ లో శృతి హాసన్ కనపడుతుంది. వీటికి సంభందించిన సన్నివేశాలును ముంబాయి లో షూట్ చేస్తారు. నవంబర్ ఆఖరు వారంలో ఈ షూటింగ్ ప్రారంభమవుతుంది. అలాగే మెయిన్ హీరోయిన్ గా జెనీలియా కనపడతుంది. హాసిని గా బొమ్మరిల్లుగా అదరకొట్టిన ఆమె ఈ చిత్రంలోనూ ఓ విభిన్నమైన మ్యానరిజంతో అలరించనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లొకేషన్స్ చూడటానికి భాస్కర్ ఆస్ట్రేలియా బయిలు దేరి వెళ్లారు. అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ కోసం కాజల్ వంటి ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే శృతిహాసన్ మాత్రమే ఫైనలైజ్ అయింది. ఇక శృతి హాసన్ కి ఇది రెండో తెలుగు సినిమా. మొదటిది రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్దకు జోడీగా చేస్తున్నది. అది ఓ ఫాంటసీ చిత్రం.


Click it and Unblock the Notifications











