»   »  సీక్రెట్ ఎఫైర్ లేదంటోంది...నమ్మచ్చుగా

సీక్రెట్ ఎఫైర్ లేదంటోంది...నమ్మచ్చుగా

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : శృతిహాసన్ కెరీర్ మొదటనుంచి లవ్ ఎఫైర్స్ పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు లవర్స్ ని మారుస్తోందంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాస్తోంది. ఆమె ఖండిస్తూ వస్తోంది. తాజాగా శ్రుతి గురించి ఓ వార్త బయటికొచ్చింది. క్రికెటర్‌ సురేష్‌రైనాతో శ్రుతిహాసన్‌ ప్రేమలో పడిందనీ, ఆ బంధాన్ని ఇద్దరూ రహస్యంగా ఉంచుతున్నారనీ ప్రచారం మొదలైంది. అయితే అలాంటిదేమీ లేదని ఆమె, రైనా ఇద్దరూ ఖండిచారు. అయినా వాళ్ళేమో సీక్రెట్ గా ఉంచుదామనుకుంటే ఇలా మీడియాలో రచ్చ చేస్తే ఎలా అని కొందరు సినిమావాళ్లు కామెంట్స్ చేసుకుంటున్నారు.

  ఐపీయల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సమయంలో జట్టులో ఉన్న రైనాతో శ్రుతికి పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం పెరిగిందనీ, ఇటీవల డేటింగ్‌ కూడా సాగుతోందని చెవులు కొరుక్కొంటున్నారు. ఈ విషయం గురించి తెలిసిన వెంటనే రైనా స్పందించాడు. తాను ఎవ్వరినీ ప్రేమించడం లేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత శ్రుతి కూడా ట్విట్టర్‌ ద్వారా తనపై సాగుతున్న ప్రేమ ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి కబుర్లు పక్కనపెట్టి పని చూసుకొందాం పదండి అని సెలవిచ్చింది. అయినప్పటికీ ప్రేమ ప్రచారం ఆగడం లేదు.

  Shruthi Hassan secret love affair with Suresh Raina

  తెలుగులో తొలి చిత్రం చేస్తున్నప్పుడే బోలెడన్ని ప్రేమ కబుర్లు వినిపించింది శ్రుతిహాసన్‌. 'అనగనగనా ఓ ధీరుడు'లో తనతో పాటు కలిసి నటించిన సిద్ధార్థ్‌తో ప్రేమలో పడిందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ ఇద్దరి మధ్య బంధం ఎంతోకాలం సాగలేదు.
  'ఓ మై ఫ్రెండ్‌' తర్వాత విడిపోయినట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ శ్రుతిహాసన్‌ ఎవ్వరితోనూ ప్రేమలో పడలేదు. కొన్నాళ్లుగా ఆమె నటన, ఎక్స్‌పోజింగ్‌ గురించే ఎక్కువగా చర్చ సాగుతోంది. 'డి డే'లో భంగిమలు, ముద్దు సన్నివేశాలు, 'ఎవడు'లో రెచ్చిపోయి ఆరబోసిన అందాల గురించే ప్రేక్షకులు వేడివేడిగా మాట్లాడుకొంటున్నారు.

  ఓ వైపు హిట్‌ చిత్రాలు.. మరోవైపు స్టార్‌ హీరోలతో అవకాశాలు.. ఇలా శృతి ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోంది. హిందీలో 'లక్‌' ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ... టాలీవుడ్‌లో సూర్యకు జంటగా '7ఆమ్‌ అరివు'తో తెరంగేట్రం చేసింది. ఆదిలో అపజయాల హీరోయిన్‌గా ముద్రపడినా.. తెలుగులో 'గబ్బర్‌సింగ్‌'తో ఆ పేరు తుడిచిపెట్టుకుపోయింది. ఆ జోరు కొనసాగిస్తూ రవితేజతో 'బలుపు', రామ్‌చరణ్‌తో 'ఎవడు', తాజాగా అల్లుఅర్జున్‌తో 'రేసుగుర్రం'... ఇలా వరుస హిట్లను అందుకుంది.

  ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో 'పూజై' నటిస్తుండగా, సూర్యతో ఓ చిత్రం, అలాగే మణిరత్నం మహేష్‌ - నాగార్జునలతో తెరకెక్కించనున్న సినిమాలోనూ శ్రుతిహాసన్‌ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి కాకుండా.. హిందీలో అక్షయ్‌కుమార్‌తోనూ, 'గబ్బర్‌'లో జాన్‌ అబ్రహంతోనూ నటిస్తోంది. ఇలా మూడు భాషల్లో హిట్లు అందుకోవటమే కాకుండా.. అందరూ స్టార్‌ హీరోలతో నటించటంపై చాలా ఖుషీలో ఉందట శ్రుతి.

  అక్కడా.. ఇక్కడా.. అంటూ విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నా.. ఇష్టమైన కష్టం కూడా ఎంతో హాయి అంటూ సన్నిహితుల వద్ద సంతోషాన్ని వ్యక్తం చేస్తోందట. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో కొన్నైనా విజయాల బాట పడితే.. ఇప్పట్లో శ్రుతిహాసన్‌కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.

  English summary
  Shruti Hassan has not made any comment on her secret relationship with Suresh Raina. The actress was also linked with actors like Dhanush, Siddharth, Girish Kumar, Rithvik Dhanjani and few others in the past, but none of them has come out true.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more