శృతిహాసన్, అక్షర హాసన్‌పై రూమర్లు.. స్టార్ హీరోయిన్ల అసహనం
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతుళ్లు శృతిహాసన్, అక్షర హాసన్‌తో వెండితెర మీద హీరోయిన్లుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరు కలిసి నటించిన దాఖలాలు లేవు. అయితే తాజాగా ఓ చిత్రంలో వారిద్దరు కలిసి నటిస్తున్నారనే వార్తలు తమిళ చిత్ర పరిశ్రమలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్త విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో శృతిహసన్ పీఆర్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఇంతకు ఆ విషయంపై ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..

హాలీవుడ్ రీమేక్‌లో అక్షర, శృతి
హాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన డోంట్ బ్రీత్ అనే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారనే వార్త కోలీవుడ్‌లో కొద్దికాలంగా వినిపిస్తున్నది. ఆ సినిమా దర్శకుడు ఫేడ్ అల్వారెజ్‌తో తమిళ నిర్మాత, దర్శకులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ నటుడు హీరోగా నటిస్తున్నారనే వార్తలు తమిళ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

రూమర్లు ధాటిగా
డోంట్ బ్రీత్ చిత్రంలో శృతిహాసన్, అక్షర హాసన్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లాక్‌డౌన్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై శృతిహాసన్ పీఆర్ వర్గాలు స్పందించాయి.

శృతి, అక్షర వర్గాల ఖండన
డోంట్ బ్రీత్ చిత్రం గురించి పీఆర్ వర్గాలు స్పందిస్తూ.. శృతి, అక్షర నటిస్తున్నారనే వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ మీడియా ఊహగానాలే. శృతి, అక్షరను సంప్రదించారనే వార్తలో నిజం లేదు. ఇంకా తన తదుపరి సినిమాకు సంబంధించి ఫైనల్ చేయలేదు. ఇంకా ఏ సినిమాలో నటించాలనే నిర్ణయం తీసుకోలేదు. ఈ వార్తలపై ఇద్దరు కూడా అసహనం వ్యక్తం చేశారు అని వెల్లడించారు.

శృతిహాసన్ కెరీర్ ఇలా...
ఇక శృతిహాసన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో రవితేజతో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. అయితే క్రాక్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తు్నారు. అంతేకాకుండా లాభమ్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్పీ జనార్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











