Hi Nanna: నాని కోసం శృతి హాసన్ కాక్‌టైల్ పార్టీ.. 5 నిమిషాలకే అన్ని లక్షలు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలా క్రేజీ సినిమాలు తెరకెక్కుతోన్నాయి. అయితే, వాటిలో చాలా తక్కువ మూవీలు మాత్రమే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న 'హాయ్ నాన్న' మూవీ ఒకటి. ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
'దసరా'తో సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకున్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తన 30వ సినిమాను శౌర్యూవ్ అనే దర్శకుడితో చేస్తున్నాడు. 'హాయ్ నాన్న' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో రాబోతుంది. దీనిపై ఆరంభం నుంచీ ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

నాని నటిస్తున్న 'హాయ్ నాన్న' మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తి అయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. ఈ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలను విడుదల చేశారు. ఇక, డిసెంబర్ 7వ తేదీన ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'హాయ్ నాన్న' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కూడా పెట్టినట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. పబ్‌లో కాక్‌టైల్ పార్టీ నేపథ్యంతో ఈ పాట ఉండబోతుందని తెలిసింది. దీనికోసం ఎంతో మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించినా.. చివరకు స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందని కూడా తెలిసింది.
'హాయ్ నాన్న' మూవీలోని కాక్‌టైల్ పార్టీ సాంగ్‌లో కనిపించేందుకు శృతి హాసన్ ఏకంగా రూ. 90 లక్షలు చార్జ్ చేసిందని తెలిసింది. ఈ పాటతో పాటు ఆమె మరో రెండు మూడు సన్నివేశాల్లో కనిపించబోతుందట. ఇలా మొత్తం 5 నిమిషాల పాటు ఇందులో శృతి హాసన్ స్క్రీన్‌పై కనిపిస్తుందని తెలిసింది. ఇంత దానికే ఆమెకు దాదాపు కోటి ఇస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. నాని - శౌర్యూవ్ కాంబోలో తెరకెక్కుతోన్న 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











