డబుల్ ధమాకా: మహేష్ తో శృతిహాసన్ రెండు సినిమాలు

By Srikanya

హైదరాబాద్ : 'గబ్బర్‌సింగ్‌' విజయంతో వరుస అవకాశాలు అందుకొంది శ్రుతిహాసన్‌. 'బలుపు', 'ఎవడు', 'రామయ్యా వస్తావయ్యా'లాంటి భారీ చిత్రాలు చేసింది. 'బలుపు' , 'ఎవడు' విజయం సాధించింది. ఇప్పుడు ఆమె మహేష్ సరసన రెండు చిత్రాలు కమిటైందని సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. మణిరత్నం చిత్రం కొద్దిగా లేటయ్యేటట్లు ఉన్నా, కొరటాల శివ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

మహేష్ బాబు,కొరటాల శివ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ వరసగా ప్రాజెక్టులు ఒప్పుకోవటంతో ఈ చిత్రం లేనట్లే అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.కానీ . యు.టి.వి సౌత్ డివిజన్ హెడ్ అయిన ధనంజయన్ గోవింద్ ఈ విషయమై డేట్స్ ఖరారు చేసి అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆయన ట్వీట్ చేసిన దాన్ని బట్టి జూలై 14 నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే వారంలో మిగతా ఆర్టిస్టులు,టెక్నీషియన్స్ ఎవరెవరు అనేది తెలియచేస్తామన్నారు.

Shruti Haasan double dhamaka with Mahesh Babu

అతిధి తరువాత ఈ సంస్థ మహేష్ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా గతఏడాది ఖరారయినా కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 'మిర్చి'తో ఆకట్టుకొన్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'రేసుగుర్రం'లో నటించి ఎదురుచూస్తోంది. శ్రుతిహాసన్‌ ఈ క్రితం సంవత్సరం హిందీలోనూ మెరిసింది. 'డి డే', 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాల్లో నటించింది. అయితే ఫలితాలు మాత్రం ఆశించినట్లుగా రాలేదు. 'డి డే'లో శ్రుతి భంగిమలు బాగా శృతిమించాయని వివాదం రేగింది. అయితేనేం ఇప్పుడు ఆమె చాలా బిజీ హీరోయిన్ గా మారింది.

మరో పక్క తన కొత్త చిత్రం కోసం కమల్‌ స్వయంగా వెళ్లి కాల్షీట్‌ కోరినా శ్రుతిహాసన్‌ మాత్ర తిరస్కరించింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ''ప్రస్తుతం నా సొంత విషయాలకు కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితి. నటనకే సమయం మొత్తం సరిపోతోంది. కొత్త ఏడాది సంబరాల కోసం మాత్రం రెండు రోజులు సెలవు తీసుకున్నా. అంతే.. మళ్లీ అదే షూటింగ్‌.. అదే బిజీ. ఎంత అంటే నాతో కలిసి పనిచేసేందుకు నాన్న స్వయంగా వచ్చి నా కాల్షీట్‌ కోరారు. ఖాళీ లేక ఆయనకు నో చెప్పాను''అని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X