పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్? ఆ ఇద్దరితో బ్రేకప్‌తో కమల్ కుమార్తె షాకింగ్ డెసిషన్?

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బ్యాచిలర్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేసి వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరిగా ఉన్న శృతిహాసన్ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి గురించి ఇప్పటికే తన నిర్ణయాన్ని తెలియజేశారని కోలీవుడ్‌లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శృతిహాసన్ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? లేదా? ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
సూపర్‌స్టార్ కొడుకుని 6 ఏళ్లు వెంటాడిన హీరోయిన్... బిడ్డని అలా కాపాడుకున్న నటుడు
సూపర్‌స్టార్ కొడుకుని 6 ఏళ్లు వెంటాడిన హీరోయిన్... బిడ్డని అలా కాపాడుకున్న నటుడు

భారతదేశం గర్వించదగ్గ మహానటుడు కమల్ హాసన్- సారిక దంపతుల గారాలపట్టిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు శృతిహాసన్. బలమైన సినీ నేపథ్యం ఉన్నప్పటికీ కెరీర్‌‌లో సెటిల్ కావడానికి శృతి చాలా కష్టపడ్డారు. తొలుత హే రామ్ మూవీలో బాలనటిగా నటించారు. ఆ తర్వాత.. 2009లో హిందీ చిత్రం లక్ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం అనగనగా ఓ ధీరుడు, 7 ఓమ్ అరివు, ఓ మై ఫ్రెండ్ తదితర చిత్రాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ ట్యాగ్ వేయించుకున్నారు. ఈ విమర్శలను, ట్రోలింగ్‌ను పట్టించుకోకుండా ముందుకు సాగిన శృతి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్‌తో హిట్ బాట పట్టారు శృతి హాసన్.

Shruti Haasan Marriage Rumours Go Viral Is the kamal haasan s daughter Ready to Tie the Knot

ఆ తర్వాత ఎవడు, రేసు గుర్రం, పూజ, శ్రీమంతుడు, వేదాళం, ప్రేమమ్, సింగమ్ 3, క్రాక్, వకీల్ సాబ్, వీరసింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య, సలార్, కూలీ చిత్రాలతో తిరుగులేని నటిగా, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు శృతి. పాతికేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలో నటించారు. నటిగానే కాకుండా సింగర్‌గా, సంగీత దర్శకురాలిగా తన టాలెంట్ నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ట్రైన్... తెలుగులో ఆకాశంలో ఒక తార, సలార్ 2 చిత్రాల్లో శృతి హాసన్ నటిస్తున్నారు.

Recommended For You
'ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది’
'ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది’

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ వివాదాలతో వార్తల్లో నిలిచారు శృతిహాసన్. ముఖ్యంగా ఆమె ఎఫైర్లు, బ్రేకప్ వార్తలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. శంతను హాజారికా, సురేష్ రైనా, రణబీర్ కపూర్, ధనుష్, సిద్ధార్థ్‌లతో ఆమె ప్రేమాయణం సాగించినట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇటలీకి చెందిన మైఖేల్ కోర్సాలే, శంతను హాజారికాలతో మాత్రం తన రిలేషన్‌ను బహిరంగంగానే వెల్లడించారు శృతి. కానీ ఈ బంధాన్ని పెళ్లి పీటల వరకు చేర్చడంలో మాత్రం శృతి విఫలమయ్యారు. ఈ ఇద్దరితో బ్రేకప్ తర్వాత ప్రేమాయణాలకు దూరంగా తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు శృతి.

You May Also Like
Rakasa Closing Collections: రాకాస క్లోజింగ్ కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి లాభమెంత? నష్టమెంత?
Rakasa Closing Collections: రాకాస క్లోజింగ్ కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి లాభమెంత? నష్టమెంత?

అయితే ఈసారి మాత్రం శృతి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. అది కూడా పెద్దలు కుదిర్చిన సంబంధానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కోలీవుడ్ కోడై కూస్తోంది. శృతికి తగ్గ వరుడిని వెతికేపనిలో కమల్ హాసన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలిసిన వారి నుంచి కొన్ని సంబంధాలు రాగా.. అవి కమల్‌కు, శృతికి నచ్చలేదని కోలీవుడ్ టాక్. అయితే వీలైనంత త్వరగా శృతికి పెళ్లి చేసి తండ్రిగా బాధ్యతను పూర్తి చేయాలని కమల్ హాసన్ భావిస్తున్నారట. అయితే తల్లిదండ్రుల జీవితాలను దగ్గరిగా చూసిన శృతిహాసన్.. పెళ్లిపై తనకు అంత ఆసక్తి లేదని గతంలోనే పలుమార్లు తెలిపారు. మరి తాజా పెళ్లి వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: kamal haasan shruti haasan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X