Jana Nayagan: విజయ్ చివరి మూవీలో మరో స్టార్ హీరోయిన్.. దళపతి ప్లాన్ మామూలుగా లేదుగా..

Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో కూడా చాలా మంది దళపతి విజయ్ ను ఇష్టపడుతుంటారు. అందుకే ఆయన తమిళంలో చేసిన చాలా చిత్రాలు తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. రాజకీయాల్లో అడుగుపెట్టి దళపతి విజయ్ తన చివరి చిత్రం జన నాయగన్ (Jana Nayagan) అనే సినిమాతో రాబోతున్నారు. అయితే.. ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ తీసుకోబోతున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?

దళపతి విజయ్ చివరి చిత్రం జన నాయగన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జన నాయగన్ అని టైటిల్ పెట్టడం వెనుకున్న కూడా ఓ కారణముందట. సినిమా కథకి ఈ టైటిల్‌కు ఎంత యాప్ట్ ఉంటుందో తెలియడం లేదు. కానీ.. దళపతి విజయ్ ప్రస్తుతం పొలిటికల్ జర్నీకి స్టార్ చేసిన విషయం తెలిసిందే. ఆయన పొలిటికల్ మైలేజ్ కోసమే 'జన నాయగన్' అనే టైటిల్‌ను పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Shruti Haasan may join Thalapathy Vijay s upcoming film Jana Nayagan

మరోవైపు.. కేవీఎన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా భగవంత్‌ కేసరి మూవీకి రీమేక్‌ అనే రూమర్లు వినిపించాయి. కాజల్ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుండగా.. శ్రీలీల పాత్రలో మమితా బైజు నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో బాబీ డియోల్‌ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రీసెంట్‌గా సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ టైంలో వీటీవీ గణేష్ కూడా లీక్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు. ప్రొడక్షన్ టీం ఎక్కడా ఈ విషయాన్ని బయటకు రివీల్ చేయడం లేదు.

ఇదెలా ఉంటే.. దళపతి చివరి సినిమాలో ఒక ప్రధాన పాత్ర పెట్టారంట. ఆ పాత్రలో విజయ్ తో సరసన నటించడానికి మరో హీరోయిన్ గా శ్రుతి హాసన్ తీసుకున్నారట. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని సమాచారం. శ్రుతి హాసన్ .. గతంలో దళపతి విజయ్ తో కలిసి నటించిన 'పులి' సినిమా నటించారు.ఈ చిత్రం విజయ్ ప్రధాన పాత్ర పోషించగా, శ్రుతి హాసన్ అతని భార్యగా నటించింది. అలాగే.. ఈ చిత్రంలో హన్సిక మోత్వానీ, శ్రీదేవి, సుదీప తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవి కేవలం పుకార్లు మాత్రమే. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రాబోతుంది.

Shruti Haasan may join Thalapathy Vijay s upcoming film Jana Nayagan

దళపతి విజయ్ కెరీర్ విషయానికొస్తే.. ఆయన గతేడాది వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్) సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ తండ్రి, కొడుకు పాత్రలతో నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన 'జన నాయగన్' లో కనిపించబోతున్నాడు . రాజకీయ అంశాలు ఇమిడి ఉన్న యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. రిపబ్లిక్ డే సందర్బంగా జన నాయగన్ మూవీ ఫస్ట్ , సెకండ్ లుక్‌లను మేకర్స్ ఆవిష్కరించారు, రెండో లుక్‌లో విజయ్ దివంగత ఎంజిఆర్‌ను గుర్తు చేసేలా విరాట్ ధరించి, ఐకానిక్ డ్రెస్ లో దర్శనమిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X