ఉండటానికి ఇల్లు కూడా లేని స్థితిలో కమల్ హాసన్ మాజీ భార్య?
Recommended Video

కమల్ హాసన్ మాజీ భార్య, నటి సారిక గురించి బాలీవుడ్ సర్కిల్ నుండి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఉండటానికి ఇల్లు కూడా లేని దీనమైన స్థితిలో ఉన్నారని, మాజీ భర్త కమల్ హాసన్, కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా పట్టించుకోక పోవడంతో ఆమె పరిస్థితి గమనించిన అమీర్ ఖాన్ సహాయం అందించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఏం జరిదింది?
2004లో కమల్ హాసన్‌తో విడిపోయిన తర్వాత నుండి సారిక ముంబైలోని తన పుట్టింట్లో ఉంటున్నారు. ఇటీవలే సారిక తల్లి చనిపోయింది. ఆమె మరణం తర్వాత సారికకు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా పోయిందని తెలుస్తోంది.

ఆస్తి అంతా అతడికే వెళ్లిపోయింది
సారిక తల్లి తన వీలునామాలో.... ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంటితో పాటు ముంబైలోని మొత్తం ఆస్తులను వారి ఫ్యామిలీ ఫ్రెండ్ డాక్టర్ విక్రమ్ ఠాకూర్‌కు పేరున రాశారట. ఇంటిని అతడు స్వాధీనం చేసుకోవడంతో సారిక నిరాశ్రయురాలైనట్లు తెలుస్తోంది.

సహాయం అందించిన అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ సోదరికి సారిక బెస్ట్ ఫ్రెండ్. సారిక పరిస్థితి చూసి చలించిపోయిన అమీర్ ఖాన్... తన వంతు సహాయం చేశారని, ప్రస్తుతం ఆమె ఉండటానికి సహాయం చేసినట్లు తెలుస్తోంది. తన ఆస్తి తనకు రావడానికి సారిక కోర్టులో పోరాడుతున్నట్లు సమాచారం.

శృతి హాసన్, అక్షర హాసన్
సారిక తన భర్తతో 2004లో విడిపోయారు. పెద్ద కూతురు శృతి హాసన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమెకు ముంబైలో సొంత ఫ్లాట్ కూడా ఉంది. ఇక చిన్న కూతురు అక్షర హాసన్ చెన్నైలో తన తండ్రి వద్ద ఉంటోంది.

ఆ ముగ్గురూ పట్టించుకోలేదా?
మాజీ భర్త కమల్ హాసన్... ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర్ హాసన్ ఉండగా అమీర్ ఖాన్ సహాయంతో ఉండాల్సిన దుస్థితి ఏమిటి? వీరు ఆమెకు సహాయంగా నిలవలేదా? అనే సందేహాలు సినీ జనాల్లో వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











