కొరటాల శివ, చిరంజీవి చిత్రం.. ఆమె హీరోయిన్ కాదు కానీ!

Recommended Video

Shruti Haasan To Play Key Role In Chiranjeevi Movie ? | Filmibeat Telugu

రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు చాలా గ్యాప్ తీసుకుని సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు, కొరటాల శివ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. కొరటాల శివ చిరంజీవికి జోడి కోసం పలువురి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది.

కీలక పాత్ర కోసం

కీలక పాత్ర కోసం

ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం శృతి హాసన్ పేరుని దర్శకుడు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథలో చాలా కీలకమైన ఆ పాత్రలో స్టార్ హీరోయిన్ నటిస్తే బావుంటుందని కొరటాల భావించారట. దీనికోసం శృతి హాసన్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రే అయినప్పటికీ అది హీరోయిన్ రోల్ కాదు. ఈ నేపథ్యంలో శృతి హాసన్ అంగీకరిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

 పవర్ ఫుల్ స్టోరీ

పవర్ ఫుల్ స్టోరీ

మెగాస్టార్ కోసం కొరటాల అద్భుతమైన కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి రైతు పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. సైరా నరసింహారెడ్డి షూటింగ్ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి కూడా రాంచరణే నిర్మాత అంటూ ప్రచారం జరుగుతుండడం విశేషం.

 హీరోయిన్లుగా

హీరోయిన్లుగా

ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నటించే హీరోయిన్లుగా నయనతార, తమన్నా లాంటి క్రేజీ బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంతవరకు కొరటాల శివ ఎవరినీ ఫైనల్ చేయలేదు. కొందరు బాలీవుడ్ హీరోయిన్లని కూడా కొరటాల శివ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

 మెగా హీరోలకు

మెగా హీరోలకు

ఇక శృతి హాసన్ మెగా హీరోలకు బాగా కలిసొచ్చిన హీరోయిన్. పవన్ సరసన నటించిన గబ్బర్ సింగ్, రాంచరణ్ తో నటించిన ఎవడు, అల్లు అర్జున్ కు జోడిగా నటించిన రేసుగుర్రం చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం చిరంజీవి సైరా చిత్రంపైనే పూర్తి దృష్టి పెట్టారు. త్వరలో ప్రారంభం కాబోయే కీలక షెడ్యూల్ లో బిగ్ బి అమితాబ్ కూడా పాల్గొనబోతున్నారు. 4 రోజుల షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అంతటితో అమితాబ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X