కొరటాల కోరుకున్న శృతి హాసన్.. బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ తర్వాత..!
బడా స్టార్ కమల్ హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన శృతి హాసన్ కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషా చిత్రాల్లో సత్తా చాటింది శృతి. అయితే ఉన్నట్టుండి గత రెండేళ్లుగా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. మ్యూజిక్ కార్యక్రమాలు చేస్తూ, బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు కొడుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. దీంతో ఇక శృతి సినిమాల్లోకి రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ అందరికీ షాకిస్తూ మళ్లీ వెండితెర బాట పట్టింది శృతి.
తెలుగు పవన్ కళ్యాణ్ సరసన కాటమ రాయుడు సినిమాలో కనిపించిన ఈ అందాల భామ ఆ తరువాత మరే సినిమాకు సైన్ చేయలేదు. రెండేళ్ల కింద వచ్చిన బెహన్ హోగా తేరీ తర్వాత శృతి పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది. మరాఠీలో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నా కూడా అది కూడా కుదర్లేదు. కాగా దాదాపు రెండేళ్లకు పైగా గడిచాక ఇప్పుడు సినిమా తెరపై కనిపించేందుకు సిద్ధమైంది శృతి. ఈ మేరకు లాభం అనే తమిళ సినిమా పూజా కార్యక్రమాలు కూడా చేసేసి షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే రీ ఎంట్రీ ఇచ్చాక తెలుగులో ఆమె చేయబోతున్న సినిమాపై ఆసక్తికర వార్త షికారు చేస్తోంది.

ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న శృతి హాసన్ ఫుల్ కాన్సెన్ట్రేటెడ్‌గా సినిమాల వైపు చూస్తోందని తెలుసుకున్న కొరటాల శివ.. ఆమెను తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్‌గా తీసుకుందామని సన్నాహాలు చేస్తున్నారట. అంటే మెగాస్టార్ చిరంజీవితో కొరటాల చేయనున్న సినిమాలో శృతినే హీరోయిన్‌గా కనిపించనుందన్నమాట. ఈ సినిమాను ఆగస్టులో సెట్స్ పైకి తీసుకురానున్నారని సమాచారం. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది శృతి హాసన్. ఈ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి.. కొరటాలతో రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల శృతి కూడా ఆసక్తిగానే ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











