డబ్బు చేతిలో పడితేనే వస్తా : వివాదంలో హీరోయిన్ శృతి హాసన్?
హీరోయిన్ శృతి హాసన్ నటించిన సినిమా 2018లో ఒక్కటి కూడా రాలేదు. 2017లో సింగం 2, కాటమరాయుడు, బెహున్ హోగి తేరి చిత్రాల తర్వాత ఆమె తన తండ్రి కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'శభాష్ నాయుడు' ప్రాజెక్టు మీదనే బిజీ అయిపోయారు.
కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతి ముందు నుంచీ వివాదాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆమె రెమ్యూనరేషన్ విషయంలో గొడవ పడటం చర్చనీయాంశం అయింది. డబ్బులు ఇస్తే తప్ప షూటింగుకు రానంటోందట.

మహేష్ మంజ్రేకర్‌తో
మరాఠీ ఫిల్మ్ డైరెక్టర్, నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో శృతి హాసన్ ఓ సినిమాకు కమిట్ అయ్యారు. అయితే షూటింగుకు రావాలని కోరగా.... ముందు తన చేతిలో అడ్వాన్స్ డబ్బులు పడాల్సిందే అని భీష్మించుకుని కూర్చుందట.

డబల్ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందా?
శృతి హాసన్ సాధారణంగా తాను తీసుకునే రెమ్యూనరేషన్ కంటే డబల్ అమౌంట్ ఈ చిత్రానికి చార్జ్ చేస్తోందట. నిర్మాతలు ఇచ్చిన కమిట్మెంట్ మేరకు ముందుగా సగం డబ్బు అడ్వాన్స్ ఇస్తేనే షూటింగుకు వస్తానని తెగేసి చెప్పిందట.

కొన్ని ఛేదు అనుభవాలు...
గతంలో రెమ్యూనరేషన్ విషయంలో శృతి హాసన్‌కు కొన్ని ఛేదు అనువాలు ఎదురవ్వడం వల్లనే ఆమె ఈ సారి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెమ్యూనరేషన్ గొడవ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

శభాష్ నాయుడు సంగతేంటి?
తండ్రి కూతుళ్లు కమల్ హాసన్, శృతి హాసన్ కలిసి చేస్తున్న ‘శభాష్ నాయుడు' చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. స్పై కామెడీ అడ్వంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ ఈ మూవీని కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇందులో ఇంకా రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











