అల్లు అర్జున్ సరసన శ్రుతి హాసన్ ఎంపిక
హైదరాబాద్: గబ్బర్ సింగ్ తో హిట్ కొట్టిన శ్రుతి హాసన్‌కి మరో మెగా హీరో ప్రక్కన అవకాసం దక్కినట్లు టాలీవుడ్ సమాచారం. త్వరలో ఈ భామ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాలున్నాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ఆమెను తీసుకున్నట్లు సమాచారం. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా||వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇందులోనే శ్రుతి హీరోయిన్ గా నటించబోతోంది. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందిస్తారు. రేసు గుర్రం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం శ్రుతి హాసన్... 'ఎవడు', 'బలుపు', ఎన్టీఆర్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ... అల్లు అర్జున్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో పనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్ధాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు. సహ నిర్మాత డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...బన్నీతో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ప్రస్తుతం అల్లు అర్జున్ పూరీ జగన్నాధ్ 'ఇద్దరమ్మాయిలతో' టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు .'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమా టైటిల్ ట్రేడ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎప్పుడూ వెరైటీ టైటిల్స్‌తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి స్క్ర్రిప్టుని డిఫెరెంట్ గా పూర్తి స్ధాయి వినోదం తో సమకూర్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి 'దేశముదురు' సినిమా చేశారు. అది అర్జున్‌కు మాస్ ఇమేజ్‌ను పెంచింది. ఈ చిత్రం గురించి పూరి జగన్నాథ్ తెలియజేస్తూ "ఈ కథ విని బన్ని ఎంతో ఎగ్జయిట్ అయ్యాడు. ఇద్దరమ్మాయిలతో బన్ని చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మా కాంబినేషన్‌లో మరో విభిన్న చిత్రంగా ఇది రూపొందనుంది'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











