లక్కీ హీరోయిన్ కి జూ ఎన్టీఆర్, పవన్ లతో లక్ చిక్కేనా...?
'లక్" చిత్రంతో బాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా లక్కు చిక్కని భామ శృతిహాసన్. అయితే ఈ చిత్రం తర్వాత 'బొమ్మరిల్లు" సిద్ధార్థతో కలిసి 'అనగనగా ఒక ధీరుడు"తో తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించినా శృతికి చేదు అనుభవమే ఎదురైంది. దాంతో కొంత నిరాశపడ్డ ఈ అమ్మడు ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో వుంది. దానికి కారణం ప్రస్తుతం తన చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ వుండటమేనట.
ప్రస్తుతం తమిళ్ లో సూర్య హీరోగా దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ రూపొందిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ ' 7ఎఎమ్ అరివు"లో నటిస్తున్న శృతి తెలుగులో క్రేజీ హీరోలైన జూ ఎన్టీఆర్ తో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న చిత్రంలోనూ, అలాగే సిద్ధార్థతో దిల్ రాజు నిర్మిస్తున్న 'ఓ మైఫ్రెండ్" చిత్రాలతో పాటు పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ రూపొందించనున్న 'దబాంగ్" రీమేక్ 'గబ్బర్‌సింగ్"లోనూ నటించే ఛాన్స్ కొట్టేసి ఒక్కసారిగా బిజీ హీరోయిన్ అయిపోయింది. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ గా ఒక్క విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోని శృతిహాసన్ కు ఇకనైనా లక్కు చిక్కుతుందో లేదో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











