సన్నిలియోన్ ప్లేస్ లోకి శృతి హాసన్
హైదరాబాద్ : గబ్బర్ సింగ్ తో గోల్డెన్ లెగ్ గా మారిన శృతి హాసన్ తెలుగు, తమిళ భాషల్లో పూర్తి బిజీ నటిగా మారింది. ముఖ్యంగా ఆమె చేత. ఐటం సాంగ్ చేయంచాలని ఉత్సాహపడే దర్శక,నిర్మాతలు పెరుగుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి పూరి జగన్నాథ్ చేరినట్లు సమాచారం. మొదట సన్నిలియోన్ చేత ఐటం సాంగ్ చేయిద్దామనుకున్న దర్శకుడు ఇప్పుడు ఆ ప్లేస్ లోకి శృతి హాసన్ ని తీసుకువచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో 'పూజై' నటిస్తోంది. ఇవి కాకుండా.. హిందీలో అక్షయ్‌కుమార్‌తోనూ, 'గబ్బర్'లో జాన్ అబ్రహంతోనూ నటిస్తోంది. ఇలా మూడు భాషల్లో హిట్లు అందుకోవటమే కాకుండా.. అందరూ స్టార్ హీరోలతో నటించటంపై చాలా ఖుషీలో ఉంది శ్రుతి. అక్కడా.. ఇక్కడా.. అంటూ విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నా.. ఇష్టమైన కష్టం కూడా ఎంతో హాయి అంటూ సన్నిహితుల వద్ద సంతోషాన్ని వ్యక్తం చేస్తోందట. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో కొన్నైనా విజయాల బాట పడితే.. ఇప్పట్లో శ్రుతిహాసన్‌కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.
చిత్రం విశేషాలుకు వస్తే...

ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ఎన్టీఆర్, ప్రకాష్‌రాజ్, సుబ్బరాజుపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తారని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా దర్శక,నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''పూరి జగన్నాథ్ మార్క్ సినిమా ఇది. ఎన్టీఆర్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాలకు ప్రాథాన్యముంది. ఆయన తొలిసారి పూర్తిస్థాయి పోలీసు పాత్రని పోషిస్తున్నారు. వినోదం, యాక్షన్ అంశాలు అలరిస్తాయి. ఇంటిల్లిపాదికీ నచ్చే మంచి సినిమా అవుతుంద'' అని అన్నారు.
ఈ చిత్రంలో మధురిమ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ:వక్కంతం వంశీ, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, కళ: బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు.


Click it and Unblock the Notifications











