నందమూరి బాలకృష్ణ సరసన యంగ్ హీరోయిన్: గోపీచంద్ మలినేని సూపర్ ప్లాన్

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి వరుస పెట్టి ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ అవన్నీ ఆయనకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి. అయినప్పటికీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమాలో నటిస్తున్న ఆయన.. ఇది పట్టాలపై ఉండగానే టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమాను కూడా లైన్‌లో పెట్టేసుకున్నాడు.

ఈ ఏడాది ప్రారంభంలోనే 'క్రాక్'తో కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. దీని తర్వాత అతడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు. ఇందుకోసం గతంలో మాదిరిగానే నిజ సంఘటనల ఆధారంగా ఓ స్టోరీని రాస్తున్నాడు. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన వందేళ్ల నాటి చరిత్రను చదివేస్తున్నాడు. ఇలా బాలయ్యతో ఓ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాను తీయబోతున్నాడని అంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Shruti Hassan Fix for Gopichand Balakrishna Movie

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో బాలయ్యకు జోడీగా శృతి హాసన్‌నే తీసుకుంటున్నాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ మేరకు ఆమెతో కొద్ది రోజుల క్రితమే చర్చలు కూడా జరపగా.. తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ ఏడాది వచ్చిన 'క్రాక్'తో పాటు గతంలో గోపీచంద్ తెరకెక్కించిన 'బలుపు'లోనూ శృతీనే హీరోయిన్‌గా చేసింది. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇదే సెంటిమెంట్‌ను ఇప్పుడు బాలయ్య సినిమా కోసం ఫాలో అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X