రామ్ చరణ్ ఆరెంజ్ నుంచి శృతి హాసన్ అవుట్
రామ్ చరణ్ తేజ తాజా చిత్రం ఆరెంజ్ నుంచి సెకెండ్ హీరోయిన్ గా కమిట్ అయిన శృతిహాసన్ బయిటకు వచ్చేసిందని సమాచారం. జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం కోసం చాలా మంది హీరోయిన్స్ ని ట్రై చేసి చివరకు ఈమెను కన్ఫర్మ్ చేసారు. అయితే ఆమె పాత్ర ప్లాష్ బ్యాక్ లో మాత్రమే వస్తుందని,అదీ గెస్ట్ రోల్ అని తెలిసి ఆమె రిజెక్టు చేసిందని సమాచారం. అయితే కమిట్ అయ్యేటప్పుడు ఈ విషయం తెలియదా అంటే స్టార్ హీరో సరసన అనగానే ఆమె ఆనందంతో ఒప్పుకుందని, అయితే ఈ లోగా తెలుగులో మరిన్ని ఆఫర్స్ ఆమెకు వస్తూండటంతో ఆమె ఈ పాత్ర చేయటం తన కెరీర్ కు ఏ రకంగానూ ఉపయోగపడదని భావించినట్లు వినపడుతోంది. అందుకే డిల్లీ లో జరిగే షెడ్యూలు కు ఆమె వెళ్లటం లేదంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. మగధీర చిత్రం అనంతరం వస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాపై ట్రైడ్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే శృతి హాసన్ ప్రస్తుతం సిద్దార్ధ హీరోగా కె.సూర్య ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో పాంఠసీ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











