‘ఎవడు’ నుంచి సమంత ఔట్, శృతి హాసన్ ఇన్!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న 'ఎవడు' చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ సర్క్యూట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత స్థానంలో శృతి హాసన్‌ను ఎంపిక చేసారని ఆ వార్తల సారాంశం.
సమంత డేట్స్ ప్రాబ్లమ్ వల్లనే ఇలా జరిగిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఏది ఏమైనా ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది. ఇప్పటికే 'ఎవడు' షూటింగ్ కొంత పూర్తయింది. ఈ సమయంలో హీరోయిన్ మార్పు అనే వార్త అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది.
ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ నటిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంతో పాటు ప్యారలాల్ గా వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' చిత్రంతో పాటు....... తొలి బాలీవుడ్ చిత్రం 'జంజీర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











