‘సలార్’ నుంచి షాకింగ్ అప్‌డేట్: ప్రభాస్‌తో పాటు ఫైటింగ్‌కు సిద్ధమైన శృతి హాసన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సలార్'. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. రెండో దానిని ప్రారంభించే లోపు కరోనా సెకెండ్ వేవ్ వచ్చింది. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. దీంతో సినిమా విడుదల పైనా దీని ప్రభావం పడుతుందని అంతా అనుకున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో షూటింగ్‌ను పున: ప్రారంభించబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది.

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీలో హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటిస్తుందని ఎఫ్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో శృతి హాసన్ పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుందట. అంతేకాదు, ఆమెతో యాక్షన్ సీన్స్ కూడా చేయించబోతున్నారట. ఇందుకోసం ఈ బ్యూటీ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకోబోతుందన్న టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి ఆమె కూడా ఫైటింగ్ సీన్స్ చేయనుందన్న మాట.

Shruti Hassan Learning Martial Arts for Prabhas Salaar

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందులోనూ అతడు తండ్రి కొడుకుగా కనిపించనున్నాడట. ఇక, ఈ మూవీ కథపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, దేనీ పైనా క్లారిటీ మాత్రం రావడం లేదు. దీంతో ఈ మూవీ తరచూ ట్రెండింగ్ అవుతోంది. ఈ భారీ యాక్షన్ మూవీని హొంబళే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X