ఆ తెలుగు హీరోతో...శృతి హాసన్ లవ్ ఎపైర్
కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కెరీర్ తక్కువైనా ప్రేమ వ్యవహారాల్లో పెద్ద గానే బిహేవ్ చేస్తోందంటున్నారు. తాజాగా ఆమె యంగ్ హీరో సిద్దార్ధతో ప్రేమలో మునిగి తేలుతోంది అని చెప్తున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ రావు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న ఆమె..షూటింగ్ పనుల మీద తరచూ హైదరాబాద్‌కు వస్తోంది. ఈ సమయాల్లో ఆమె సిద్దార్థతోనే ఎక్కువ సమయం గడుపుతున్నదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ జంట రెస్టారెంట్లు, పార్టీల్లో అర్ధరాత్రుల దాకా గడుపుతున్నదని కూడా అంటున్నారు. ఈ మధ్య హైదరాబాద్ కు వచ్చినప్పుడు..తాను తెలుగు నేర్చుకుంటున్నట్టు శృతి పేర్కొంది. త్వరలోనే తెలుగులో మాట్లాడతానని కూడా ప్రకటించింది. శృతి ప్రేమ వ్యవహారం తండ్రి కమల్‌కు కూడా తెలుసునని భావిస్తున్నారు. నటునిగా సిద్దార్థ అంటే అమితంగా ఇష్టపడే కమల్..ఈ వ్యవహారాన్ని తేలిగ్గా పరిగణిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే..ఈ గొడవల్లో పడి ఇప్పుడిప్పుడే నటనలో నడకలు నేర్చుకుంటున్న తన కూతురు కెరీర్‌లో వెనకబడిపోతుందేమోననే ఆందోళనతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఓ సోషియో పాంటసీ అని చెప్తున్నారు. వర్కింగ్ టైటిల్ గా యోధా అని పెట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











