ఎన్టీఆర్ సరసన శృతి హాసన్ ఖరారు
గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తో స్పీడు మీదున్న హీరోయిన్ శృతి హాసన్, తన కెరీర్ లో తొలిసారిగా విజయాన్ని రుచి చూసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఇప్పుడు వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. మొదటిగా ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ ఆమెకు మరోసారి హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం త్వరలో పట్టాలు ఎక్కనుంది.
గతంలో దిల్ రాజు నిర్మించిన ఓ మై ప్రెండ్ చిత్రంలో ఆమె చేసింది. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. అలాగే ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రలో మొదటే ఆమెనే అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఆమె కు డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సిన స్ధితి ఏర్పడింది. అయితే ఈ సారి గోల్డెన్ లెగ్ గా మారిన ఆమెను తీసుకోవటానికి ఆందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
హిందీ చిత్రం లక్ తో పరిచయమైన శృతి హాసన్... తెలుగు, తమిళ, హిందీ... మూడు చోట్లా సినిమాలు చేసినా, సరైన హిట్ దక్కించుకోలేకపోయింది. అందరూ ఐరన్ లెగ్ అని కామెంట్ చేసే స్ధితికి వెళ్లింది. హై ఎక్సపెక్టేషన్స్ మధ్య పెద్ద హీరోలు,దర్శకులతో చేసిన 'సెవెన్త్ సెన్స్', 'ఓ మై ఫ్రెండ్', 'త్రీ' లాంటి చిత్రాల్లో మంచి నటన కనబరచినా ఫలితం లేకుండా పోయింది. అయితే శ్రుతికి తొలి విజయం 'గబ్బర్ సింగ్' ద్వారా దక్కింది. భాగ్యలక్ష్మిగా లంగా వోణీలో కనిపించి అలరించింది.
శృతి హాసన్ మాట్లాడుతూ... ఎప్పుడూ ప్లాప్ వచ్చిందని నిరుత్సాహపడలేదు. ఇప్పటిదాకా నా వల్ల ఏ సినిమాకీ నష్టం జరగలేదు. నిజం చెప్పాలంటే ఎంతో కొంత మేలే జరిగి ఉంటుంది. అలాంటప్పుడు నేనెందుకు నిరుత్సాహపడాలి. అయినా చిత్ర పరిశ్రమలోనే కాదు, ఏ రంగంలోనైనా ప్రతిభే మనకు ముఖ్యమని నాన్నగారు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే తొలి నుంచీ కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకొన్నాను అంది.


Click it and Unblock the Notifications











