అల్లు అర్జున్ సినిమాను రిజెక్టు చేసిందా?
హైదరాబాద్: అల్లు అర్జున్ పూరీ జగన్నాధ్ 'ఇద్దరమ్మాయిలతో' టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో శృతిహాసన్ హీరోయిన్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె చేయటం లేదని వినపడుతోంది. ఆమె సున్నితంగా ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లు సమాచారం. ఈ మేరకు ఆమె...తాను బన్నీ,పూరీ వంటి గ్రేట్ పీపుల్ తో పని చేయలేకపోతున్నందుకు బాదపడుతున్నానంటూ చెప్పిందని కోలివుడ్ లో వినిపిస్తోంది.
శృతి ఈ ఆఫర్ ని రిజెక్టు చేయటానికి కారణం డేట్స్ ఖాళీ లేకపోవటమే అని చెప్పిందని తెలుస్తోంది. హిందిలో ఓ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో చేయలేకపోతున్నానని చెప్పినట్లు సమాచారం. ఇత అల్లు అర్జున్ 'ఇద్దరు హీరోయిన్స్ తో ఈ సినిమా చేయబోతున్నారు. అలాగే 'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమా టైటిల్ ట్రేడ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఇక ఎప్పుడూ వెరైటీ టైటిల్స్‌తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి స్క్ర్రిప్టుని డిఫెరెంట్ గా పూర్తి స్ధాయి వినోదం తో సమకూర్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి 'దేశముదురు' సినిమా చేశారు. అది అర్జున్‌కు మాస్ ఇమేజ్‌ను పెంచింది. ఇక తాజా సినిమా విషయానికొస్తే సెప్టెంబర్ 20న ముహూర్తం జరుగుతుందని, అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలిసింది.
అలాగే పూరికి ఒకప్పుడు ఆస్థాన సంగీత దర్శకుడైన చక్రి ఈ చిత్రానికి స్వరాలందించనున్నారట. ఎప్పటినుంచో పూరీతో సినిమాలు చేయడానికి ఇష్టపడే బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications











