మహేష్ బాబు సినిమాలో కాబట్టే ఆ రేటు

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నటించే చిత్రంలో చేయటానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే మొదటిది ఎక్కువ మందిని ఈ స్టార్స్ చిత్రాలు రీచ్ అవుతాయి. అలాగే చిన్న క్యారెక్టర్ లేదా ఐటం చేసినా అంతులేని గుర్తింపు వస్తుంది. అంతేకాదు...ఈ చిత్రాలుకు మంచి బడ్జెట్ ఉంటుంది. దాంతో పేమెంట్స్ కూడా బాగుంటాయి. తాజాగా ఈ విషయాన్ని శృతి హాసన్ ఐటం విషయంలో నిజమైంది అంటున్నారు. ఆమెకు ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేసినందుకు కానూ...యాభై లక్షలు పే చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇక ఈ పాటలో మహేష్ బాబు లుంగీ డాన్స్ లో కనిపిస్తాడని చెప్తున్నారు. అంతేకాదు సూనూసూద్ సైతం ఈ పాటలో స్టెప్స్ వేసి పాటకు మరింతి కిక్ ఇవ్వనున్నాడు. మహేష్ ఈ పాటలో వేసిన స్టెప్స్ కు థియోటర్స్ విజిల్స్ తో మారు మ్రోగిపోతాయని అంటున్నారు. దూకుడులో పార్వతి మిల్టన్ సాంగ్ ని మించి ఈ పాట హిట్ అవుతుందని చెప్తున్నారు.

Shruti Hassan's Rs 50 lakhs worth song!

మహేష్ బాబు 'ఆగడు' సినిమాలో శృతి హాసన్ ఐటం సాంగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ పాట శృతి హాసన్ స్వయంగా పాడడం మరో ప్రత్యేకత. ఈ పాట చిత్రీకరణ సమయంలో చాలా ఎంజాయ్ చేశామని శృతి తెలిపింది. ప్రేక్షకులకు ఈ పాట,చిత్రం మంచి వినోదం అందిస్తుందని ఆశిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. శ్రీను వైట్ల దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 19న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. త్వరలో ఆడియో విడుదల తేదీని ప్రకటించనున్నారు .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X