తమన్నా, శృతి హాసన్ లిప్ లాక్ ముద్దు దుమారం!
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శృతి హాసన్, తమన్నా గురించి ఓ వార్త ఇపుడు ఫిల్మ్ సర్కిల్‌లో చర్చనీయాంశం అయింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ పబ్లిక్‌గా లిప్ లాక్ ముద్దు పెట్టుకున్నారట. ఇలా హీరో హీరోయిన్ ముద్దుల్లో మునిగి తేలడం ఏంటి విడ్డూరం...అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇద్దరూ కలిసి హగ్(ఆలింగనం) చేసుకున్నప్పుడు అనుకోకుండా వీరి పెద్దాలు టచ్ అయ్యాయా? లేక కావాలనే ఇలా చేసారా..? అనేది వారికే తెలియాలి.
ఆ గొడవ సంగతి పక్కన పెట్టి తమన్నా సినిమాల గురించి వివరాల్లోకి వెళితే....ప్రస్తుతం అమ్మడు 'బాహుబలి' షూటింగులో బిజీగా గడుపుతోంది. బాహుబలి చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్, తమన్నాలపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగుకు శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ప్రత్యేకమైన సెట్టింగులో ఈ సాంగును చిత్రీకరిస్తున్నారు.

శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే....
శృతి హాసన్ తొలిసారిగా విజయ్ సరసన నటించబోతోంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం మీడియా, ఆడియన్స్ 'విజయ్ 58' అని పిలుస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో హాలీవుడ్ సినిమాల్లో మాదిరి వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్ చూడబోతున్నాం. ఈ చిత్రంలో విజయ్, శృతి హాసన్‌తో పాటు కన్నడ స్టార్ సుదీప్, నిన్నటితరం ప్రముఖ నటి శ్రీదేవి కూడా ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. ఈ చిత్రానికి చింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











