మొన్నజూ ఎన్టీఆర్ కి బై-నేడు పవన్ కళ్యాణ్ కి బైబై: శృతి హాసన్
హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న శృతిహాసన్ కి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన శృతి మొదటి సినిమా పరాజయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న'దమ్ము" చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుందని మొదట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఈ సుందరి ఈ సినిమా నుండి తప్పుకుంది. అయితే డేట్స్ సమస్య వల్లే 'దమ్ము" చిత్రానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నానని, అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని శృతిహాసన్ క్లారిఫై చేసిందనుకోండి... అయితే మరో పెద్ద బ్యానర్ లో మళ్ళీ ఛాన్స్ మిస్ చేసుకొన్నదని వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే శృతిహాసన్ (గ్లామర్ లో)పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది. తను చేసిన అనగనగా ధీరుడు సినిమా హిట్ కాకున్నా ఆమె గ్లామర్ కు మంచి పేరు వచ్చింది.
అయితే ఈ మధ్య రిలీజ్ అయిన సెవెన్త్ సెన్స్", ఓ మై ఫ్రెండ్" చిత్రాలు కూడా శృతిని నిరాశపరిచాయి. దీంతో పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న 'గబ్బర్ సింగ్" పైనే ఆశలు పెట్టుకుంది. అయితే తాజా అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శృతి హాసన్ 'గబ్బర్ సింగ్" ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. శృతి నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడం వల్లే 'గబ్బర్ సింగ్" నుంచి ఆమెను తప్పించారన్న వార్త వినిపిస్తోంది. అతి పెద్ద బడ్జెట్ 40కోట్ల రూపాలయతో రూపొందుతున్నఈ చిత్రానికి పవన్ ఇమేజ్ కి సిరిపోయోటట్లు సౌత్ ఫిల్మిం ఇండస్ట్రీ నుండే ఒక టాప్ హీరోయిన్, క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం రిచా గంగోపాధ్యాయ, అమలా పాల్ లను అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో పవన్ సరసన నటించే ఛాన్స్ ఎవరికొస్తుందో మరి...?


Click it and Unblock the Notifications











