Devara: దేవరలో ఎన్టీఆర్ భార్యగా మరో హీరోయిన్.. జాన్వీ కపూర్ కంటే ఎక్కువగా!
టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు నేషనల్, ఇంటర్నేషనల్ క్రేజ్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుని మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు.
ఫుల్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

గతంలో ఎన్నడూ చూడని యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూట్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో షెడ్యూళ్లను పూర్తి చేసుకుంటూ ఇప్పుడు గోవాలో షూట్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రూపొందుతోన్న 'దేవర' చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోం. అలాగే, ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, దీనిపై క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రెండో హీరోయిన్ గురించి వివరాలు లీక్ అయ్యాయి.

'దేవర' మూవీలో గుజరాతీ నటి, ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్నేకర్ భార్య శృతి మరాఠీ కూడా నటిస్తుందని ఆ మధ్య వార్త వైరల్ అయింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆమె ఎన్టీఆర్ భార్యగా నటిస్తుందట. అంటే ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్రకు ఆమె జోడీగా చేస్తుందన్న మాట. ఈ రోల్ జాన్వీ కపూర్ కంటే ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











