Devara: ఎన్టీఆర్ మూవీలో ఆ హీరో భార్య.. ఎలాంటి పాత్రను చేస్తుందో తెలిస్తే!
ఏ హీరోకూ సాధ్యం కాని రీతిలో ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను కొడుతూ ఫుల్ జోష్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీంతో అతడితో ఉత్సాహం రెట్టింపు అయింది. ఫలితంగా మరింత జోష్‌తో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. అలా ఇప్పుడు 'దేవర' మూవీ చేస్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమానే 'దేవర'. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికితోడు ఇటీవలే వచ్చిన గ్లింప్స్ వీడియోతో 'దేవర' చిత్రంపై హైప్ అమాంతం పెరిగిపోయింది.

వైల్డ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే తేదీన విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 80 శాతం టాకీ పార్టును కంప్లీట్ చేశారు.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, దీనిపై క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రెండో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది.

'దేవర' మూవీలో గుజరాతీ నటి, ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్నేకర్ భార్య శృతి మరాఠీ కూడా నటిస్తుందట. ఈమె ఎన్టీఆర్ పక్కనే ఉండే ఓ ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అమ్మడు పలు షెడ్యూళ్లలో సైతం పాల్గొన్నట్లు సమాచారం. ఈ సినిమా ద్వారా శృతి మరాఠీ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోవడం ఖాయం అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 5 నుంచి వాయిదా పడనుంది.


Click it and Unblock the Notifications











