మహేష్ షూటింగ్ లో తొలిరోజు గురించి శృతి
హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ హీరోయిన్. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. 'మిర్చి' తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిదే. ఇటీవలే పుణే లో చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రం షూటింగ్ గురించి శృతి హాసన్ చాలా ఎక్సైట్ మెంట్ తో ట్వీట్ చేసింది.
శృతి ట్వీట్ చేస్తూ..." హలో పూణే!! నా కొత్త సినిమా ఈ రోజు ప్రారంభం అవటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది.". అంది. అలాగే షూటింగ్ పూర్తవగానే ... "తొలి రోజు నా కొత్త తెలుగు చిత్రం...! గ్రేట్ డే...సెట్స్ మీద లవ్ లీ ఎనర్జీ ఉంది...ఇదంతా చూస్తుంటే ఓ లవ్ లీ మూవీ రాబోతోందని అనిపిస్తోంది. !". అని ట్వీట్ చేసి, మహేష్ అభిమానుల్లో ఆనందం నింపింది.

ఇక మహేష్‌బాబు సోమవారం నుంచి రంగంలోకి దిగుతున్నారు. పుణెలో వారం రోజులపాటు కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. అందులో మహేష్ బాబుతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటోంది. 'ఆగడు' పూర్తయ్యాక మహేష్ సెట్‌కు వెళుతోంది ఇప్పుడే. దాంతో అందరి దృష్టీ ఈ చిత్రంపై ఉంది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాండున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











