హీరోయిన్ కి లైన్ వేయటానికే ప్రెస్ మీట్ లు ...
హైదరాబాద్: కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'పటాస్'. శ్రుతి సోడి హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్యాచ్‌వర్క్ జరుగుతోంది. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. ఆమె జర్నలిస్టు గా కనిపించనుంది.
ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి... జర్నలిస్టుగా చేసే ఆమెను పదే పదే చూడటం కోసం పోలీస్ అధికారి అయిన కళ్యాణ్ రామ్ ప్రెస్ మీట్ లు పెడుతూంటాడట. అందులోంచి వచ్చే ఫన్ సినిమాలో బాగా పే చేస్తుందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఫన్ బాగా రాయగలిగిన అనీల్ ..దర్సకుడు కావటంతో చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆమె పాత్ర గురించి వచ్చిన ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఈ చిత్రంలో బాబాయ్ పాటలో అబ్బాయ్ డాన్స్ చేయనున్నారు. అరెవో సాంబా... అంటూ 'రౌడీ ఇన్‌స్పెక్టర్'లో బాలకృష్ణ చేసిన సందడిని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. విజయశాంతితో కలిసి బాలకృష్ణ చేసిన ఆ పాట మాస్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇప్పుడు అదే గీతాన్ని రీమిక్స్ చేసి తన సినిమాలో వినిపించబోతున్నారు.
ఇందులో 'రౌడీ ఇన్‌స్పెక్టర్'లోని 'అరెవో సాంబా...' గీతాన్ని రీమిక్స్ చేసి వినిపిస్తున్నారు. బాబాయ్ పాటలో అబ్బాయ్ ఆడిపాడితే అభిమానులకు కొత్తగా ఉంటుందని భావించిన దర్శక,నిర్మాతలు ఆ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. ''కల్యాణ్‌రామ్ పోలీసు పాత్రలో నటిస్తున్న చిత్రమిది. వినోదం, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కుతోంది. కల్యాణ్‌రామ్ పాత్ర, చిత్రణ కొత్త తరహాలో ఉంటాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు దర్శకుడు.
సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, సంగీతం: సాయికార్తీక్, కూర్పు: తమ్మిరాజు, కళ: ఎమ్.కిరణ్‌కుమార్.


Click it and Unblock the Notifications











