స్టార్ క్రికెటర్ తో హాట్ బ్యూటీ అన‌న్య పాండే.. నెట్టింట్లో ట్రోల్స్.. అసలు కథేంటీ?

Ananya Pandey:ఎంటర్టైన్మెంట్ అంటే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి సినిమా, క్రికెట్. ఈ రెండింటికి వీడదీయరాని సంబంధం ఉంటుంది. క్రికెటర్లంటే.. సినిమా వాళ్లకు, సినిమా వాళ్లంటే క్రికెటర్స్ కు పిచ్చి. అలాగే.. ఈ రెండు రంగాల వారి జీవితాలు కూడా ఒకేలా ఉంటాయని చెప్పవచ్చు. వీళ్లు ఏం చేసినా ఇట్టే వైరలవుతోంది. వారు ఎవరితో కలిసి తిరిగిన రూమర్స్ వైరలవుతుంటాయి. క్రికెట్ లో కంటే.. సినీ ఇండస్ట్రీలో కాస్తా ఎక్కువే వినిపించాయి. తాజాగా ఓ హాట్ బ్యూటీ ఓ స్టార్ క్రికెటర్ తో దిగిన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో? ఆ స్టార్ క్రికెటర్ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి.

ఆ వైరల్ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు. టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బాలీవుడ్ నటి అనన్య పాండేలు. వీరిద్దరూ 'బీట్స్ ఇండియా' కంపెనీకి అంబాసిటర్స్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సదరు కంపెనీ సోషల్ మీడియా షేర్ చేసింది. టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన కెరీర్ లో ఎదుగుతున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో రాణిస్తున్నారు దీంతో ఆయనకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ హెడ్‌ఫోన్స్ సంస్థ బీట్స్ శుభ్‌మన్ గిల్‌తో పాటు అనన్య పాండేలతో బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Shubman Gill And Ananya Pandeys Latest Photos viral

ఈవెంట్ కు సంబంధించిన శుభ్‌మన్ గిల్, అనన్య పాండేలు ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే అనన్య పాండేతో శుభ్‌మన్ గిల్ ఫోజు ఇవ్వడంపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. తమకు నచ్చిన రీతిలో ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయనీ అనుకుంటున్నారా? ఈ అమ్మడు ఎక్కడ ఉంటే అక్కడ కనిపిస్తే.. రూమర్స్ గుప్పుమంటాయి. టీమిండియా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

అసలేం జరిగిందే.. ఐపీఎల్ 2024 సీజన్ లో రియాన్ పరాగ్ ఓ లైవ్ స్ట్రీమింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ స్ట్రీమింగ్ సమయంలో ఈ ఆటగాడు యూట్యూబ్ ఓపెన్ చేయడంతో సెర్చ్ హిస్టరీ కనిపించింది. ఆ హిస్టరీని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అందులో స్టార్ హీరోయిన్ల హాట్ వీడియోల కోసం వెతికినట్టు కనిపించింది. అందులో అన్యన పాండే సెర్చ్ హిస్టరీలో ఉంది. దీంతో పరాగ్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా అనన్య పాండేతో గిల్ ఫోజు ఇవ్వడంతో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

సాధారణంగా ఈ హాట్ బ్యూటీ ఎక్కడ కనిపించిన అది వార్తగా మారుతోంది. గతంలో ప్రముఖ క్రికెటర్ పాండ్యా తో పలుమార్లు కనిపించడంతో వీరిద్దరూ
డేటింగ్ లో ఉన్నారంటూ క్రేజీ రూమర్స్ బాలీవుడ్ లో గుప్పుమన్న విషయం తెలిసింది. వారి మధ్య మ్యాటర్ చాలా దూరం వెళ్తుందని సోషల్ మీడియాలో క్రేజీ టాక్. వాస్తవానికి వీరిద్దరూ మధ్య రూమర్స్ ఎలా మొదలయ్యాంటే.. అనన్య ఇంటి ముందు ఏకంగా 3 కోట్ల ఖరీదైన రేంజరోవర్ కారు కనిపించింది. ఈ కారు ఆమెనే కొనుకుందా? లేదా? ఇచ్చారంటూ .. చివరికి డేటింగ్ లో భాగంగా పాండ్యా ఆ కారు బహుమతిగా ఇచ్చారంటూ గాసిప్స్ వెలువడ్డాయి.

ఇదిలాఉంటే.. బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే కెరీర్ విషయానికి వస్తే.. లైగర్‌ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ అమ్మడు. కానీ ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో బాలీవుడే పరిమితమైంది. ఇప్పటిదాకా అనన్య నటిగా ఒక్క సినిమాలో కూడా మెప్పించలేకపోయింది. కేవలం అందాల ప్రదర్శనతో బాలీవుడ్‌లో నెట్టుకురాగలుగుతోంది. అలా.. బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. త్వరలో ఆమె నటించిన మొదటి వెబ్‌సిరీస్‌ 'కాల్‌ మీ బె', 'కంట్రోల్‌' సినిమాతో ఓటీటీలో సందడి చేస్తుంది. ప్రస్తుతానికి అనన్య పాండే ఇలా వార్తల్లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X