సిధ్ శ్రీరామ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటాడంటే..?

సిధ్ శ్రీరామ్ పేరు, ఆయన గాత్రం, పాడిన పాట తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరు. ప్రేమలోని మాధుర్యాన్ని, విరహ వేధనకు ప్రాణం పోసి పాడతాడా? అనేట్టుగా, గుండెకు హత్తుకునేలా చేస్తాడు ఈ యువ గాయకుడు. ఈయన పాట పాడాడంటే చాలు ఆ సినిమాకు ఎక్కడా లేని హైప్ వస్తుంది. సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ సింగర్‌గా మారిన సిధ్.. రెమ్యూనరేష్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

సౌత్ ఇండియాలో స్టార్ సింగర్స్..

సౌత్ ఇండియాలో స్టార్ సింగర్స్..

సౌత్ ఇండియాలో స్టార్ సింగర్స్ అంటే అందరికీ ఎస్పీబీ, యేసుదాస్, జానకమ్మ వంటి వారు గుర్తొస్తారు.అయితే వీరు బాగా సీనియర్స్ కావడంతో యువ సింగర్స్ ఎంతో మంది తమ ప్రతిభను చాటారు. మధ్యలో కార్తిక్, చిన్మయి, శ్రేయా ఘోషాల్ వంటి వారు వచ్చారు. ఇప్పటికీ వారు బిజీగానే ఉన్నారు. అయితే ఓ యువ సంచలనం మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకొచ్చింది.

పాటలన్నీ సూపర్ హిట్..

పాటలన్నీ సూపర్ హిట్..

ఆ యువ సంచలనం పేరే సిధ్ శ్రీరామ్. ఏ పాట పాడినా సరే అతని గొంతులోంచి వస్తే అది చార్ట్ బస్టర్ అయి తీరాల్సిందే. ఉండిపోరాదే అని ప్రేమ పాట పాడినా.. చెప్పుకోలేనే అంటూ విరహ వేదన పాట పాడినా అందర్నీ మెప్పించాడు సిధ్ శ్రీరామ్.

సామజవరగమనతో పీక్స్..

సామజవరగమనతో పీక్స్..

అల వైకుంఠపురములో సినిమాలో సామజవరగమన పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట పాడిన సిధ్ శ్రీరామ్‌కు అంతకు మించిన క్రేజ్ వచ్చింది. ఇంకేం ఇంకేం కావాలే అని పాడినా.. మాటే వినదుగా అని అన్నా.. నీలి నీలి ఆకాశం అన్నా.. అదే సిధ్ శ్రీరామ్‌కే చెందింది.

Recommended Video

R Narayana Murthy About LB Sriram Greatness
రెమ్యూనరేష్ తెలిస్తే షాక్..

రెమ్యూనరేష్ తెలిస్తే షాక్..

ఇక ఇంతలా పాపులర్ అయిన సింగర్ రెమ్యూనరేష్ కూడా చుక్కల్లోనే ఉంటుంది. సింగర్స్ రెమ్యూనరేషన్ గురించి రకరకాల పుకార్లు వస్తుంటాయి. అసలు డబ్బులు కూడా ఇవ్వకుండా పాడించుకుంటారని, సాధారణ సింగర్స్‌కు ఐదు వేలు, పది వేలు ఇస్తారనే వదంతులున్నాయి. అయితే స్టార్ స్టేటస్‌ అనుభవించే సింగర్స్ లక్ష వరకు ఇస్తారని తెలుస్తోంది. అయితే సిధ్‌కు మాత్రం ఒక్కో పాటకు ఐదు లక్షల వరకు చెల్లిస్తున్నారట. అంటే ఆయన డిమాండ్ ఏ రేంజ్‌లో అర్థం చేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X