twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్దార్దపై సీరియస్ అయిన దిల్ రాజు!?

    By Srikanya
    |

    రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్దార్ధ కి రీసెంట్ గా దిల్ రాజు చాలా సీరియస్ గా ఉన్నాడు. రీసెంట్ గా అతనికి లెప్ట్ అండ్ రైట్ ఇచ్చాడని అంతటా వినపడుతోంది. దీనికి కారణం..సిద్దార్ధ మొండి పట్టుదలే అని చెప్తున్ననారు. అతన్ని ఆ మధ్య ఎలక్ట్రానిక్ మీడియా బ్యాన్ చేసింది. ప్రస్తుతం దిల్ రాజు..సిద్దార్దతో ఓ మై ప్రెండ్ చిత్రం చేస్తున్నారు.వచ్చే నెలలోనే ఆ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో తమ సినిమాకు పబ్లిసిటీ అవసరం. దాంతో దిల్ రాజు వెంటనే మీడియాకు సారి చెప్పమని..ఒత్తిడి తేవటం జరిగింది. అయితే సిద్దార్ధ దాన్ని కేర్ చెయ్యటం లేదు. ఇంతకుముందు కూడా '180" చిత్రానికి మీడియా సహకరించకపోవటంతో నిర్మాతకు చాలా లాస్ వచ్చింది. దాంతో మండిన దిల్ రాజు తన సినిమాకు,తన బిజెనెస్ కు దెబ్బకొట్టే పనులు చేయవద్దని లెప్ట్ అండ్ రైట్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రిందట సిద్దార్ధ పై ఎలక్ట్రానిక్ మీడియా బ్యాన్ పెట్టి, మా కి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సిద్దార్ధకు మా అశోశియేషన్ వాళ్ళు నోటీసులు కూడ జారీ చేసారు. అయితే సిద్దార్ద చాలా కూల్ గా ఉన్నాడు. మీడియా వారు మాత్రం సిద్దార్ద ఎట్టి పరిస్దితుల్లోనూ క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుపడుతున్నారు. అయితే సిద్దార్ద మాత్రం దానికి అంగీకరించటం లేదు. ఇక సినిమా పూర్తయితే దాని ప్రమోషన్ కి తమ అవసరం వస్తుంది కదా అని మీడియా వారు అంటున్నారు.ఈ నేపధ్యంలో దిల్ రాజు ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తాడు, సిద్దార్ద సారి చెప్తాడా లేదా అనేది ఆసక్తికరం.

    English summary
    Dil Raju is planning to release ‘Oh My Friend’ next month and has begun preparing for its publicity. But currently a media ban is on Siddarth. Unless he takes back his nasty comments and apologizes unconditionally, the media has taken strong decision that none of his films will be covered. But till now, Sidz has not apologized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X