సిద్ధార్థుడి...సీన్ రివర్స్

దానికి కారణం సిధ్ధార్దట. సొహా 'మాగ్జిమ్' మ్యాగజైన్ కోసం జరిపిన ఫోటోషూట్ అటెండ్ అయిందిట. అయితే ఆ ఫోటోషూట్‌లో తీసిన సోహా అర్ధనగ్న స్టిల్స్ పట్ల సిద్ధార్థ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడుట. దాంతో సోహా అసౌకర్యంగా ఫీలైందిట. వాస్తవానికి ఇప్పటిదాకా తనమీదున్న పక్కింటమ్మాయి ఇమేజ్‌ను వదిలి సెక్సీ ఇమేజ్‌ను ఆమె కోరుకుంటోంది. ఇది సిద్ధార్థ్‌కు గిట్టడం లేదు. పెళ్ళికి ముందే ఇట్లా ఆంక్షలు పెట్టే విధంగా బిహేవ్ చేస్తే తరువాత చాలా కష్టమని ఆలోచనలో పడిందిట. దాంతో అతడితో అనుబంధానికి ఫుల్‌స్టాప్ పెట్టి స్వేచ్ఛ పొందాలని భావిస్తున్నదనీ తెలుస్తోంది. అందుకే కొంతకాలం నుంచి ఆ ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. దాన్నిబట్టి చూస్తే వారు విడిపోయారనే అనిపిస్తోంది ఇలా సిద్దార్ధ ప్రతీ విషయంలో తన ఆధిక్యత చూపెట్టాలనే తపనతో సీన్ రివర్స్ చేసుకుంటున్నాడని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











