సిద్దార్ధ హీరోగా దిల్ రాజు మరో చిత్రం..డిటేల్స్
సిద్దార్ధతో బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన నిర్మాత దిల్ రాజు మరోసారి ఆ విజయాన్ని రిపీట్ చేయనున్నారు. తమ బ్యానర్ ద్వారా పరిచయం కానున్న మరో నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన కథ విని ఎక్సైట్ అయిన దిల్ రాజు ఆకథకు సిద్దార్ధ హీరోగా సరిపోతాడని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సిద్దార్ధతో కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసినట్లు చెప్తున్నారు. బొమ్మరిల్లు తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావటంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం ప్రేమ, స్నేహం చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడి అని తెలుస్తోంది. ఈ చిత్రంపై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నట్లు రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఓ ప్రెష్ ధాట్ తో చిత్రం చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక సిద్దార్ధ ప్రస్తుతం రాఘవేంద్రరావు కుమారుడు కె.ప్రకాశరావు దర్శకత్వంలో రెడీ అవుతున్న ఫాంటసీ చిత్రంలోనూ, రాంబాబు అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ నిర్మితమవుతున్న బావ చిత్రంలోనూ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











