‘భారతీయుడు 2’లో సిద్దార్థ్? సేనాపతి మనవడి పాత్రలోనా?

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో త్వరలో ఇండియన్ 2(భారతీయుడు 2) రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ వారమే ప్రారంభం కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో రూపొందించబోతోంది.

ఇందులో తమిళ స్టార్ శింబు కూడా కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని కారణాల వల్ల శింబు తప్పుకోవడంతో అతడి స్థానంలో సిద్ధార్థ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సేనాపతి మనవడి పాత్రలో...?

సేనాపతి మనవడి పాత్రలో...?

కమల్ హాసన్ అవినీతిపై పోరాటం చేసే స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి పాత్రలో కనిపించబోతున్నాడు. సేనాపతి మనవడి పాత్రలో సిద్ధార్థ్ నటిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

పోలీస్ పాత్రలో అంటూ మరో రూమర్

పోలీస్ పాత్రలో అంటూ మరో రూమర్

అయితే ఇందులో సిద్దార్థ్... పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడనే మరో రూమర్ కూడా ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

మర్మకళ..

మర్మకళ..

‘ఇండియన్ 2' ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతి సందర్భంగా విడుదలచేయగా మంచి స్పందన వచ్చింది. కమల్ హాసన్... సేనాపతి పాత్రలో రెండు వేళ్లు మెలిపెట్టి మర్మకళను ప్రదర్శిస్తూ కనిపించారు. ప్రాచీన యుద్ధ విద్య మర్మకళ ఈ చిత్రంలో ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్ రైటర్స్ జయమోహన్, కాబిలన్ వైరముత్తు, లక్ష్మి శరవణ కుమార్, యాక్షన్ డైరెక్టర్ జాక్ గిల్, టాడ్ గ్రిఫిత్, పీటర్ హెయిన్స్, కొరియోగ్రాఫర్ బాస్కో పని చేస్తున్నారు. లెగసీ ఎఫెక్ట్స్ సంస్థ స్పెషల్ మేకప్ అందించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X