ఎన్టీఆర్ ‘బాద్ షా’లో హీరో సిద్ధార్థ?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తి కరమైన ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. మరో హీరో నవదీప్ ఈచిత్రంలో విలన్ పాత్ర చేస్తన్న సంగతి తెలిసిందే.
'బాద్ షా' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్ లలో జరిగింది. కొన్ని సీన్లను మాత్రం హైదరాబాద్ లో చిత్రీకరించారు. క్లైమాక్స్ కు సంబంధించిన కొన్సి యాక్షన్ సీక్వెన్స్ ఇటీవల నాగార్జున సాగర్ వద్ద చిత్రీకరించారు.
దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మార్చిలో ఆడియో విడుదల చేసి ఏప్రిల్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











