సిద్దార్ధ, శృతి హాసన్ సినిమా టైటిల్ ఏంటంటే
సిద్దార్ధ హీరోగా రాఘవేంద్రరావు తనయుడు సూర్యప్రకాష్ రూపొందిస్తున్న ఫాంటసీ ఫిలింకు యోధా అనే టైటిల్ పెట్టే అవకాశమున్నట్లు సమచారం. ఎడ్వంచర్ తో ఫాంటసీ మిక్స్ చేసిన ఈ చిత్రంలో కమల్ కూతరు శృతి హాసన్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యే ఫిల్మ్ సిటీలో ప్రారంభమయింది. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం, ఓయ్ అనంతరం సిద్దార్ద చేస్తున్న చిత్రం ఇదే. అలాగే శృతిహాసన్ కూడా హిందీలో లక్ చేసిన తర్వాత ఈ చిత్రానికి కమిట్ అయింది. దాంతో ఈ చిత్రంతో అయినా లక్ తిరిగి కెరీర్ ప్రారంభం కానుందా అంటున్నారు. ఇక యోధా టైటిల్ తో ఇంతకు ముందు మోహన్ లాల్ హీరోగా ఓ ఎడ్వంచర్ చిత్రం వచ్చి హిట్టయింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా ఆడింది.
యోధా సిద్దార్ధ శృతి హాసన్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఓయ్ మోహన్ లాల్ లక్ రాఘవేంద్రరావు siddarth bommarillu yodha sruti hassan raghavendra rao


Click it and Unblock the Notifications