సిద్ధార్థ, సమంత, నందినీరెడ్డి మూవీ టైటిల్ అదేనా?
సిద్దార్థ-సమంత జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి 'జబర్‌దస్త్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ఈ చిత్రానికి బేస్ లవ్ స్టోరీనే అయినప్పటికీ...పూర్తిగా ఫన్నీగా సాగేలా దర్శకురాలు స్ర్కిప్టు రెడీ చేసారు. సిద్ధార్థ సినిమాల నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు...నందినీరెడ్డి స్టయిల్లో ఈచిత్రం తెరకెక్కుతోంది. సమంత హీరోయిన్ కావడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్.
2011లోనే ఈచితరం ప్రారంభం అవ్వాల్సి ఉండగా సమంత డేట్స్ సమస్య రావడం, నిర్మాత బెల్లంకొండ సురేష్ కి ఆమెకి మధ్య గొడవ రావడం కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. బెల్లంకొండ ఫిర్యాదుతో వీరి విబేధాలు ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇందులో కలుగ జేసుకోవడంతో చివరకు ఇద్దరి మధ్య రాజీ కుదిరింది.
చివరకు ఫిబ్రవరి 2, 2012న ప్రారంభోత్సవం జరిగింది. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. బెల్లకొండ సురేష్ ఈ చిత్రాన్ని సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకురాలు నందినీ రెడ్డి గతంలో 'అలా మొదలైంది' సినిమాకు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











