మల్టీస్టారర్ సిద్దార్థ
మల్టీస్టారర్ చిత్రాలకు తాను సిద్ధమని అంటున్నాడు హీరో సిద్దార్థ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏ భాషలో అయినా నటించేందుకు సిద్ధమని అంటోన్న సిద్ధార్థ, భాష కాదు ముఖ్యం...నటనతో ప్రేక్షకుల్ని రంజింపజేయడమే నటుడిగా తనముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చాడు.మొన్నీమధ్యనే 'ఓయ్" చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన సిద్దార్థ, ఆ చిత్రం పై బోల్డన్ని ఆశలే పెట్టుకున్నా, భాక్సాఫీస్ ని ఆ చిత్రం ఈదలేకపోయిన సంగతి విదితమే.
త్వరలోనే డైరక్షన్ చేస్తానంటోన్న సిద్దార్థ, కమర్షియల్ సినిమాలతోపాటు అవార్డ్ విన్నింగ్ సినిమాలమీద ప్రత్యేకమైన దష్టి పెడ్తానని చెబుతున్నాడు. తాను ఎప్పుడూ పక్కింటి అబ్బాయిగా వుండడానికే ఇష్టపడ్తాననీ, కండలు పెంచడం, పదిమందిని ఇరగదీసే మాస్ హీరో లుక్ తనవల్ల కాదని తేల్చి చెప్పాడు. పైకి అలా చెప్తున్నా, సిద్ధార్థ సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడనీ, ఓ యాక్షన్ సినిమాలో నటించబోతున్నాడనీ గుసగుసలు విన్పిస్తున్న సంగతి విదితమే.


Click it and Unblock the Notifications











