'కష్ట' కాలంలో సిద్ధు
ఈ మధ్యకాలంలో సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శిస్తున్న హీరోల సంఖ్య పెరిగిపోతోంది. యువ హీరో నితిన్ అయితే రెండాకులు ఎక్కువే చదివి ఎనిమిది పలకల బాడీతో మన ముందుకు వచ్చాడు అడవి సినిమాతో....ఇప్పుడా జాబితాలో సిద్దూ కూడా చేరబోతున్నాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే..నేనొద్దంటానా, కొంచం ఇష్టం..కొంచం కష్టం, ఓయ్ చిత్రాలతో లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో గా ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు తన తర్వాతి చిత్రంతో ఈ ఇమేజ్ నుండీ బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
విశ్వసనీయ కథనం ప్రకారం రవి బాబు దర్శకత్వంలో సిద్ధు ఓ యాక్షన్ మూవీలో నటించబోతున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో సిద్ధు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారట. గజిని చిత్రానికై అమీర్ ఖాన్ కు శిక్షణ ఇచ్చిన శిక్షకుడి సమక్షంలో కసరత్తులు చేస్తున్నాడట. లవర్ బాయ్ గా అలరించిన సిద్ధు యాక్షన్ చిత్రంలో, అదీ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతుండటంతో ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











