'ఆవకాయ బిర్యాని' డైరక్టర్ నెక్ట్స్ ఆ రొమాంటిక్ హీరోతో
శేఖర్ కమ్ముల నిర్మించిన 'ఆవకాయ బిర్యాని' చిత్రం దర్శకుడు అనీష్ కురువెల్ల మరో ప్రాజెక్టు ఓకే చేయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ సారి హీరోగా సిద్దార్ధను ఎన్నుకున్నారు. ఓ స్టోరీ లైన్..సిద్దార్ధకి వినిపించగా వెంటనే ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాత,మిగతా సాంకేతిక నిపుణులు వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం సిద్దార్ధ రాంబాబు అనే నూతన దర్శకుడుతో బావ అనే చిత్రం చేస్తున్నారు. అలాగే రాఘవేంద్రరావు కుమారుడు కె.సూర్య ప్రకాష్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. అలాగే సిద్దార్ధ గురువుగా చెప్పుకునే పి.జయేంద్ర దర్శకత్వంలో 180 అనే చిత్రం ఒకటి ప్రారంభం కానుంది.
సిద్ధార్థ రాఘవేంద్రరావు కె సూర్య ప్రకాష్ బావ ఆవకాయ బిర్యాని siddharth raghavendra rao k surya prakash bava avakai biryani anish kuruvilla


Click it and Unblock the Notifications