»   » జూ ఎన్టీఆర్ ఫ్యాన్సే పెద్ద జలక్ ఇచ్చారు ఆ హీరోకి...

జూ ఎన్టీఆర్ ఫ్యాన్సే పెద్ద జలక్ ఇచ్చారు ఆ హీరోకి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అయిన దానికీ కాని దానికీ జూ ఎన్టీఆర్ నామ స్మరణం చేసి, అతనికి డప్పుకొడితే ఇక నందమూరి అభిమానులంతా తననీ తమవాడుగా భావిస్తారని, తన సినిమాలొస్తే ఎగబడి చూసేస్తారని సిద్దార్థ్ పెద్ద ప్లానే వేశాడు. తనకంటూ ఫాన్ బేస్ లేకపోవడంతో నందమూరి అభిమానగణాన్ని ఆకట్టుకుంటే పని జరిగిపోతుందని సిద్దార్థ్ భావించాడు. అయితే తమ హీరోకి ఎవరైనా డబ్బా కొడితే విని ఈలలు కొట్టడానికి తప్ప తన సినిమాలు చూడ్డానికి ఎగేసుకుని రారని సిద్దార్థ్ కి 'బావ" సాక్షిగా తెలిసింది.

జూ ఎన్టీఆర్ భజన చేసినా కూడా తన సినిమాకి కనీస వసూళ్లు రాకపోవడంతో దాని ఎఫెక్ట్ అసలు పని చేయలేదని తెలియడంతో సిద్దూ తెల్లమొహమేశాడు. చిరంజీవి వీరాభిమానులమని చెప్పుకున్న హీరోలకి కూడా అతని అభిమానుల వల్ల పెద్దగా వచ్చేదేమీలేదు. అభిమాన హీరోకి అభిమాని అని తెలియడం వల్ల మహా అయితే సాప్ట్ కార్నర్ ఏర్సరచుకుంటారేమో కానీ తమ ఫేవరెట్ హీరో సినిమాకి ఎగబడినట్టుగా ఎగబడిపోరు. ఇది తెలుసుకుని అయినా ఇక సిద్దార్థ్ ఆ దొంగ భజన మానుకుని తన పని తాను చూసుకోవాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu