సిద్దార్థ - శృతి హాసన్ ల గుట్టు రట్టు చేసిన నిత్యామీనన్....!?
సినీ పరిశ్రమలో లౌక్యం లేకపోతే మనుగడ కష్టమని, అంటుంటారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వాళ్లు ప్రతి మాటలో, ప్రతి చేతలో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే వారి కెరీర్ భూస్థాపితం అయిపోతుందని అంటారు. అలా కోల్పోయిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే అలా మొదలైంది' చిత్రంతో కెరీర్ ని బ్రహ్మాండంగా మొదలు పెట్టిన నిత్యామీనన్ కి ఇలాంటి భయాలు పెద్దగా లేనట్టుంది. అందుకే 'ఓ మై ఫ్రెండ్ సినిమాలో తనకి దక్కిన అవకాశం ఎలా చేజారిందనే ప్రశ్నకి 'సిద్దార్థకి శృతిహాసన్ కావాలంట అందుకే నన్ను తీసేశారు' అంటూ చాలా క్యాజువల్ గా సమాధానమిచ్చింది.
తనకంటే పెద్ద స్టార్ అయిన సిద్ధార్థ్ గురించి సింపుల్ గా అంత మాట అనేసిన నిత్య ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. తనని మించిన ప్రొఫెషనల్ లేడని ఫీలైపోయే సిద్ధార్థ్ కి నిత్య ఇచ్చిన సమాధానంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడే ఉంటుంది. శృతిహాసన్ తో సహజీవనం చేస్తున్న సిద్ధార్థకి తన గుట్టు ఇలా నిత్యామీనన్ ద్వారా అఫిషియల్ గా రట్టు కావడం మింగుడు పడడం కష్టమేనని చెప్పాలి. విశేషమేమిటంటే సిద్ధార్థ్, నిత్య '180' సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరూ రేపు ఈ సినిమా ప్రమోషన్లలో కలిసి పాల్గొనాలి. అప్పుడు సిద్ధూ ఈ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











