Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ కి సిద్దార్ధ ఊహించని రీతిలో షాక్
ఈ శుక్రవారం సిద్దార్ధ తాజా చిత్రం "బావ" రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం..పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ఖుషీగాకు దెబ్బ కొట్టింది. అదెలా అంటే..పవన్ కళ్యాణ్..2009లో రిలీజైన హిందీ చిత్రం లవ్ ఆజ్ కల్ రీమేక్ రైట్స్ తీసుకుని ఖుషీగా చిత్రం చేస్తున్నారు. అందులో రిషీ కపూర్..తన ప్రేమ కథ చెప్తాడు. అప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీరోనే (సైఫ్ అలీ ఖాన్) కనపడతాడు. అంటే రిషీ కపూర్...యువకుడుగా ఉన్నప్పుడులా సైఫ్ అలీ ఖాన్ ఊహించుకుంటాడన్నమాట. అదే ఆ చిత్రానికి నావల్టీ. దాన్ని బావ చిత్రంలో ఎత్తేసారు.
అందిన సమాచారం ప్రకారం...బావ చిత్రంలో సిద్దార్ధ తండ్రకిగా చేస్తున్న రాజేంద్రప్రసాద్ ప్రేమ కథ సెకెండాఫ్ లో వస్తుంది. ఆ ప్లాష్ బ్యాక్ లో సిద్దార్ద కనపడతాడు. ఇంటర్వెల్ తర్వాత రాజేంద్రప్రసాద్ తన ప్రేమ కథని చెప్పి సిద్దార్ధలో ఉత్సాహం నింపే ఎపిసోడ్ అది. లవ్ ఆజ్ కల్ లో ఏదైతే క్లిక్ అయిందో దాన్నే ఇక్కడా ప్లే చేసాడు దర్శకుడు. అదే హైలెట్ గా చెప్పి సినిమా ఓకే చేయించుకున్నాడు. ఆ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సింధు తులాని ..యంగ్ రాజేంద్రప్రసాద్(సిద్దార్ధ)కి జోడిగా చేస్తోంది. ఇక ఈ విషయం కొద్ది రోజులు క్రితం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, డైరక్టర్ జయంత్, రైటర్ (త్రివిక్రమ్) ఏ రకంగా దాన్ని మార్చి చెయ్యాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు.