'బావ' ఫ్లాప్ కావటానికి సిద్దార్దే కారణమా?
మొన్న శుక్రవారం విడుదలైన సిద్దార్ద తాజా చిత్రం బావ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ దారుణ ప్లాప్ కి కారణం సిద్దార్ద ప్రవర్తనేనని ఇండస్ట్రీలో వినపడుతోంది. సిద్దార్ద ఈ చిత్రం మొదలైన దగ్గరనుండీ దర్శకుడుని ప్రక్కన పెడుతూ ప్రతీ విషయంలో వేలు పెడుతూ వచ్చాడని, ఎవరినీ వారి పని వారు చేసుకోనివ్వలేదని అంటున్నారు. సీనియర్ కో డైరక్టర్ అయిన రాంబాబు..ఈ చిత్రం పూర్తి చేసే దశలో చాలా సిద్దార్దతో ఇబ్బందులు పడ్డాడని, మింగలేక కక్కలేక అన్నట్లు..హీరోని ఏమీ అనలేకపోయాడని అదే రిజల్టుపై దారుణ ఫలితం చూపిందంటున్నారు.
కొత్తగా దర్శకులు అయ్యేవారికి డేట్స్ ఇచ్చి ఇలా సిద్దార్ధ గతంలోతను అసెస్టెంట్ గా చేసినప్పటి దర్శక నైపుణ్యం మొత్తం చూపిస్తూంటాడని ఎప్పటినుంచో వినిపిస్తోంది. బావ విషయానికి వచ్చేసరికి వరసగా హిందీ సినిమాల్లో సీన్స్, ఎపిసోడ్స్ లేపడానికి కారణం సిద్దార్ధే అంటున్నారు. మోడరైజేషన్ పేరుతో స్క్రిప్టులో రకరకాల మార్పులు చేసి బావని అటు ఇటు కాకుండా మార్చేసాడని చెప్తున్నారు. అలాగే పాటలు విషయంలోనూ సిద్దార్దదే ఫైనల్ డెసిషెన్ అని ఆ పాటలు కూడా ఎవరికీ ఎక్కలేదని,నటుడు..నటుడులాగ ఉంటే మిగతా విభాగాలు వారు తన ప్రతిభను చూపి సినిమాను సినిమాలా తీసే అవకాశం ఉంటుందని హితువు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











