Mr Bachchan: రవితేజ మూవీలో సెన్సేషనల్ హీరో.. అప్పుడలా ఇప్పుడు గెస్టుగా!
అసలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు మాస్ మహారాజా రవితేజ. సుదీర్ఘమైన సినిమా ప్రయాణంలో తనదైన చిత్రాలతో అలరించిన అతడు.. తన రేంజ్‌ను భారీగా పెంచుకుంటున్నాడు. దీంతో అదే ఉత్సాహంతో ఈ మాస్ హీరో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.
సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న మాస్ మహారాజా రవితేజ.. తన 74వ ప్రాజెక్టును స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో చేస్తున్నాడు. 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీలో హిట్ అయిన 'రైడ్' మూవీకి రీమేక్‌గా వస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'మిస్టర్ బచ్చన్' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. ఆ వెంటనే దర్శకుడు హరీష్ శంకర్ పలు షెడ్యూళ్లను సైతం విజయవంతంగా కంప్లీట్ చేశాడు. ఇటీవలే షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఇలా ఇప్పుడు సినిమాను రెడీ చేసి పెట్టేశాడు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'మిస్టర్ బచ్చన్' మూవీ ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎన్నో రకాల వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రంలో టాలీవుడ్‌లోని ఓ సెన్సేషనల్ హీరో కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'మిస్టర్ బచ్చన్' చిత్రంలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కూడా నటించినట్లు తెలిసింది. ఓ ఫైట్ సీక్వెన్స్‌లో భాగంగా అతడు ఎంట్రీ ఇచ్చి రవితేజకు సహాయం చేస్తాడని తెలిసింది. ఈ సీన్‌కు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అని అంటున్నారు. ఒకప్పుడు రవితేజ నటించిన 'డాన్ శీను' మూవీలో చిన్న పాత్రను చేసిన సిద్దు.. ఇప్పుడు ఏకంగా గెస్ట్ రోల్ చేయడం విశేషం.
ఇదిలా ఉండగా.. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తోన్న 'మిస్టర్ బచ్చన్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











