చిరంజీవి మూవీ నుంచి సిద్ధు ఔట్: ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు ఫిక్స్.. ఫ్యాన్‌కే ఓటేస్తున్న మెగాస్టార్

కొంత కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లోని అందరు హీరోలనూ సవాల్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే కొన్ని విజయాలను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో మరింత ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను ఈ మెగా హీరో లైన్‌లో పెట్టుకుంటున్నారు.

ఇలా ఇప్పటికే ఈయన 'బంగార్రాజు' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ తప్పుకున్నట్లు ఓ న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

Siddu Jonnalagadda Out From Chiranjeevi and Kalyan Krishna Movie

భోళా శంకర్‌‌గా వస్తున్నారు: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేశారు.

Siddu Jonnalagadda Out From Chiranjeevi and Kalyan Krishna Movie

ఆ డైరెక్టర్లు.. వేణు కన్ఫార్మ్: ఏకధాటిగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టుల కోసం కథలను వింటున్నారు. ఇలా వెంకీ కుడుముల, గోపీచంద్, వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్ వంటి వాళ్లతో సినిమాలు చేయాలని అనుకున్నా వర్కౌట్ కాలేదు. అయితే, బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్టతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, దీనికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

Siddu Jonnalagadda Out From Chiranjeevi and Kalyan Krishna Movie

కల్యాణ్‌కు ఛాన్స్ ఇచ్చారు: రీఎంట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే 'బంగార్రాజు' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో ఓ ప్రాజెక్టు చేసేందుకు సిగ్నల్ ఇచ్చారు. దీన్ని సుస్మిత కొణిదెల నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని అంటున్నారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తూనే ఉంది.

Siddu Jonnalagadda Out From Chiranjeevi and Kalyan Krishna Movie

మల్టీస్టారర్‌గా.. అదే రీమేక్: మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' తర్వాత కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నారు. ఇందులో మరో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇక, ఈ సినిమా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'బ్రో డాడీ'కి రీమేక్‌గానే వస్తున్నట్లు కూడా సమాచారం బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.

గ్యాప్ తర్వాత.. ఆరోజునే: మెగాస్టార్ చిరంజీవి - కల్యాణ్ కృష్ణ కురసాల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, సిద్దు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Siddu Jonnalagadda Out From Chiranjeevi and Kalyan Krishna Movie

సిద్ధు ఔట్.. డేట్సే కారణం: మెగాస్టార్ చిరంజీవి నటించే ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ మరో హీరోగా నటిస్తున్నాడని ముందే చెప్పుకున్నాం. వీళ్లిద్దరూ తండ్రి కొడుకులుగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి సిద్దు జొన్నలగడ్డ తప్పుకున్నాడట. హీరోగా అతడి డేట్స్ కుదరకపోవడం వల్లే ఈ యంగ్ హీరో దీని నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Siddu Jonnalagadda Out From Chiranjeevi and Kalyan Krishna Movie

వాళ్లిద్దరిలో ఒకరు ఫైనల్: మెగాస్టార్ చిరంజీవి మూవీ నుంచి సిద్దు జొన్నలగడ్డ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. వాళ్లే టాలెంటెడ్ హీరోలు శర్వానంద్, కార్తికేయ గుమ్మకొండ. వీళ్లిద్దరిలోనే ఇప్పుడు ఒకరిని ఫైనల్ చేయబోతున్నారట. చిరంజీవి మాత్రం తన ఫ్యాన్ బాయ్ కార్తికేయకే ఓట్ వేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X